NewsOrbit
Right Side Videos

సైకిల్‌పై సల్మాన్ సవారీ

ముంబయి:బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎవరూ ఊహించని విధంగా ముంబయి నగరంలో సైకిల్‌పై సవారీ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సల్మాన్‌ను చూసిన అభిమానులు అతనితో సరదాగా సెల్ఫీలు దిగారు. జోరున కురుస్తున్న వర్షంలో సల్మాన్ సైకిల్‌పై సవారీ చేస్తూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ప్రస్తుతం సల్మాన్ ‘దబాంగ్ 3’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతున్నది. రెండు రోజుల నుండి ముంబయిలో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలు, వరదల కారణంగా అక్కడక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సల్మాన్ షూటింగ్‌కు వెళ్లి వచ్చేందుకు కారుకు బదులు సైకిల్‌ను ఎంచుకున్నారు.

సల్మాన్‌ వ్యవహార శైలిలో చాలా మార్పువచ్చిందనీ, ఇంతకు ముందులా ఎక్కువ కోపం ప్రదర్శించడం లేదనీ బాలివుడ్ ఇండ్రస్టీలో టాక్. ఫ్యాన్స్‌తో కూడా సరదాగా గడుపుతున్నాడని చెబుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు కాస్త దూరంగా ఉంటున్నాడని పేర్కొంటున్నారు.

ఇటీవల అశోక్ పాండే అనే జర్నలిస్ట్ ఆయన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియో తీసినందుకు సల్మాన్ అతని ఫోన్ లాక్కొని గాయపర్చాడు. దీనిపై ఆ జర్నలిస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు సల్మాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment