దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `RRR` . ఈ సినిమా క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ పార్ట్‌ను ప్రస్తుతం వైజాగ్ అరకులో చిత్రీకరిస్తున్నారు. 6 రోజుల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. మంగళవారం జరుగుతోన్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ నటిస్తున్న ఓ చిన్నపాటి వీడియో లీకైంది. ఎవరో రహస్యంగా చిత్రీకరించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.