NewsOrbit
న్యూస్

చైనాకు షాకిచ్చిన గూగుల్‌.. యూట్యూబ్‌లో 2500 చైనీస్ చాన‌ల్స్ తొల‌గింపు..!

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ కొట్టిన దెబ్బ‌కు చైనాకు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్ప‌టికే గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ప‌లు చైనా యాప్‌ల‌ను వినియోగ‌దారుల డేటాను త‌స్క‌రిస్తున్నాయ‌ని చెప్పి గూగుల్ తొల‌గించింది. అది మాత్ర‌మే కాక‌.. ఇప్పుడు తాజాగా.. గూగుల్ త‌న యూట్యూబ్ ప్లాట్‌ఫాం నుంచి పెద్ద ఎత్తున చైనాకు చెందిన చాన‌ళ్ల‌ను తొల‌గిస్తున్న‌ట్లు తెలిపింది. మొత్తం 2500 వ‌ర‌కు యూట్యూబ్ చానళ్ల‌ను గూగుల్ తొల‌గించింది. ఈ మేర‌కు గూగుల్ ఒక ప్ర‌క‌ట‌నలో వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

google removed 2500 chinese youtube channels

గూగుల్ తొల‌గించిన ఆ 2500 యూట్యూబ్ చానల్స్‌కు చైనాతో సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆయా చాన‌ళ్ల‌లో త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తున్నారు. అందువ‌ల్లే వాటిని తొల‌గించామ‌ని గూగుల్ తెలియ‌జేసింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల‌ల మ‌ధ్య కాలంలో ఆయా చాన‌ల్స్‌ను తొల‌గించిన‌ట్లు తెలిపింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ప్లాట్‌ఫాంల‌పై ఇలాంటి చాన‌ళ్లు, యాప్‌ల‌ను తొల‌గిస్తున్నామ‌ని గూగుల్ వెల్ల‌డించింది.

కాగా ఈ విష‌యంపై అమెరికాలోని చైనా రాయ‌బార కార్యాల‌యం ఇంకా స్పందించ‌లేదు. అయితే ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాలు చైనాకు చెందిన యాప్స్‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో గూగుల్ అలాంటి యాప్స్‌ను, యూట్యూబ్ చాన‌ల్స్ ను తొల‌గిస్తుండ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌రోవైపు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ భార‌త్ బాట‌లో ఇప్ప‌టికే టిక్‌టాక్‌, విచాట్ యాప్‌ల‌ను నిషేధిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం చైనాను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ప్లే స్టోర్‌లో ఉన్న చాలా వ‌ర‌కు యాప్స్‌లో చైనావే ఉన్నాయ‌ని, అవి యూజ‌ర్ల డేటాను త‌స్క‌రిస్తున్నాయనే కార‌ణాల‌తో గ‌తంలో గూగుల్ ప‌లు యాప్స్‌ను తొల‌గించింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్‌ఫాంను స‌మీక్షిస్తున్నామ‌ని, త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌సారం చేసే చాన‌ళ్ల‌పై వేటు వేస్తున్నామ‌ని గూగుల్ తెలిపింది. అయితే ఆ చాన‌ల్స్‌లో ఎక్కువ‌గా చైనావే ఉండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N