NewsOrbit
న్యూస్

వామ్మో ! కోర్టుల కోసమే జగన్ వాళ్ళను పట్టుకొచ్చాడు ?? ఇదేమి రాజకీయం

ap govt in confusion about liquor policy

ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మెజార్టీ కోర్టు తీర్పులు ఉంటున్నాయి. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసిన జగన్ ప్రభుత్వం ఇందుకు విరుగుడుగా సరికొత్త మార్గాన్ని ఎంచుకొంది.

Did Jagan catch them just for the courts  This is politics
Did Jagan catch them just for the courts This is politics

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఏదైనా పిటిషన్ పడినప్పుడు, సర్కారు అందుకు దీటైన కౌంటర్ ఇస్తే కోర్టు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. అసలు కౌంటరే సరిగ్గా లేకపోతే కోర్టులా పిటిషన్ ను అనుమతించే పరిస్థితి ఏర్పడుతోంది..ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వపరంగా కౌంటర్లు సరిగా లేనందు వల్లే కోర్టుల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని గమనించింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా కౌంటర్లు వేయడానికి మాత్రమే ఒక అధికారిని నియమించింది.

శ్యామలరావు అనే సీనియర్ అధికారికి ఆ బాధ్యతలు ఇచ్చేశారు. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగన్ ప్రభుత్వం ఆ విషయంలో తమ సర్కార్ కు ఎదురు దెబ్బ తగల కూడదు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.సీఆర్డీఏ బిల్లు రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. వాటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.వాస్తవానికి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఈ బాధ్యత తీసుకోవాల్సి ఉంది. అయినా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా శ్యామలరావు ని నియమించింది.ఒక వేళ ఆయన సెలవు పెడితే.. ప్రత్యామ్నాయంగా మరో అధికారిని కూడా ముందే సిద్ధం చేశారు..మరో వైపు ఏపీ ప్రభుత్వం నియమించుకున్న న్యాయ సలహాదారులు.. న్యాయవాదుల పని తీరు.. ప్రభుత్వాన్ని నిరాశ పరుస్తోంది.

వారు పిటిషన్లు కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు. ఇక కోర్టులలో వాదనలు మాత్రం ఎంత సమర్థంగా వినిపించగలరని అసంతృప్తికి గురవుతున్నారు. గతంలో వరుస వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని.. హైకోర్టులో కొంత మంది న్యాయవాదుల్ని తొలగించి కొత్తవారిని నియమించారు. . మొత్తంమీద న్యాయవ్యవస్థ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జగన్ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఈ తరహా పరిణామాలు ఇదే మొదటిసారి అని న్యాయనిపుణులు చెబుతున్నారు

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?