ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగాఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మైకేల్ మార్గన్. వయసు 30ఏళ్లు. గతేడాది 2019లో ఆమెకు భర్తతో విడాకులయ్యాయి.
దీంతో.. ఆమె చాలా డిప్రెషన్ కి గురయ్యింది. ఇక తాను ఒంటరినైపోయానని బాగా బాధపడింది. అది జరిగిన కొద్దిరోజులకే ఆమె ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్న కుక్క కూడా చనిపోయింది. దీంతో ఆమె బాగాఒంటరి తనం తో బాధ పడింది.ఇక తన జీవితం తనకు భారంగా గడుస్తుందని ఆమె భావించింది. అప్పుడే ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది.
ఆమె పడిన శ్రమకు తగ్గ ఫలితం దక్కింది.తనకు వచ్చిన బాధ నుంచి కోలుకొని ఆమె పెయింటింగ్ పై దృష్టిపెట్టింది. కొద్దిరోజులు దాని మీద ట్రైనింగ్ తీసుకుంది. అనంతరం డిజిటల్ వర్క్ మీద ఫోకస్ పెట్టింది. తర్వాత డిజిటల్ వర్క్ మీద మరింత ఎక్కువ ఫోకస్ పెట్టి.. దాంట్లో తనకు తిరుగులేదని అనిపించుకుంది.
తర్వాత తానే సొంతంగా.. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ని కొనుగోలు చేసింది. ఇంట్లో ఉంటూనే తన పని ప్రారంభించింది. డిజిటల్ ఆర్ట్ కంపెనీ ప్రారంభించింది. అతి తక్కువ సమయంలోనే ఆమె బిజినెస్ కి మంచి గుర్తింపు లభించింది. లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూనే..ఆమె తన బిజినెస్ ని విస్తరించింది.
ఇప్పుడు తాను బెడ్రూమ్ లో ఉంటూనే చాలా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు మైకేల్ చెబుతోంది. ఆమె పనికి చాలా మంది ఫిదా అయిపోయారు. ప్రస్తుతం మైకేల్ నెలకు దాదాపు రూ.40 లక్షలు సంపాదిస్తోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఎంత పెద్ద కష్టం వెనుక అయినా ఎదో ఒక మంచి ఉంటుంది.. అని గుర్తు పెట్టుకుని జీవితం లో ముందుకు సాగినప్పుడు తప్పకుండ మంచి జరుగుతుంది.