NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టిడిపికి ఆయుధాలు అందుతూనే ఉన్నాయి…!!

 

రాష్ట్రంలో రాజకీయ వివాదాలు ఆధికార పార్టీలపై ఆరోపణలు, విమర్శలు. అస్త్రాలు పెరుగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి రోజుకో మేత దొరికినట్లు ఏదో ఒక వివాదం రాజకీయంగా దొరుకుతోంది. అసలే అంశాన్ని రాజకీయం చేయడంలో, రాజకీయంగా వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ తప్పిదాలు, జరుగుతున్న పరిణామాలు ఒక్కోటి అదనపు బలాన్ని చేకూరుస్తున్నాయి,. టిడిపి నేతలు వాటిని మరింత సాగ దీస్తూ వివాదం చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇలా ఏ ఎక్క అంశాన్ని వదలకుండా రోజు వారు కబుర్లు చెప్పుకుంటూ మొత్తానికి తెలుగుదేశం పార్టీకి అయితే కాలక్షేపం సాగిపోతున్నది. నారా లోకేష్ కి ట్విట్టర్ ద్వారా, చంద్రబాబుకు జూమ్ ద్వారా, స్థానిక నేతలకు వీడియో సందేశాల ద్వారా ఏ మాత్రం ఖాళీ లేకుండా ఉంటోంది. ఇటీవల పరిణామాలు గమనిస్తే….

 

టిడిపికి రోజు మేతే…

తాజాగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు నివాసంలో దళిత యువకుడి శిరోముండనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గిరిప్రసాద్ నగర్ కు చెందిన శ్రీకాంత్ అనే దళిత యువకుడికి జరిగిన శిరోముండనం ఘటనపై నూతన్ నాయుడు, ఆయన భార్య మధుప్రియ, వారి సహాయక సిబ్బంది వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీతానగరంలో దళిత యువకుడి శిరోముండనం కేసు విషయంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనపై పోలీసు అధికారులతో వీడియో కాన్సిరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మూడు రోజుల వ్యవధిలోనే విశాఖ జిల్లా పెందుర్తిలో శ్రీకాంత్ అనే దళిత యువకుడి శిరోముండనం కేసు జరగడం తీవ్ర సంచనం కల్గించింది. ఈ ఘటన కూడా అధికార పార్టీని విమర్శించడానికి టీడిపీకి ఆయుధం అయ్యింది. నిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వెలువడిన ఉత్తర్వులను టిడిపి అందిపుచ్చుకుంటోంది. అదే విధంగా ప్రీలాన్స్ జర్నలిస్ట్ శివప్రసాద్ పై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుుకన్న సంఘటన. అదే విధంగా రెండు రోజుల క్రితం చిత్తూీరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసిపి నేతల బెదిరింపులకు భయపడి ఒ దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలతో సహా ఇలా పలు అంశాలు అధికార పక్షాన్ని విమర్శించడానికి టెడిపి మేత దొరికినట్లు అవుతోంది.

 

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !