NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒక్కసారిగా రంగంలోకి దిగిన నిమ్మగడ్డ..! ఇక వారి అరెస్టు తథ్యం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జులై 30వ తేదీన సుప్రీంకోర్టు, హై కోర్టు ఆర్డర్ల మేరకు తిరిగి తన పదవిలో గవర్నర్ గా నియమితులయ్యారు. అంతకుముందు కొద్దినెలలవరకూ విపరీతమైన గడ్డు పరిస్థితిని అనుభవించిన రమేష్ కుమార్ ప్రస్తుతం ఏపీలో తనదైన మార్కు చూపించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. 

 

తాజాగా మీడియా వర్గాలలో వస్తున్న కథనం ఏమిటంటే.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ నిర్ణయించిందట. పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ ప్రక్షాళన పూర్తి చేశారని…. ఇక తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన చెప్పినట్లు బయటికి వార్తలు వచ్చాయి. వెంటనే వీటిపై నిమ్మగడ్డ స్పందించారు.. ఇవన్నీ…  ఒట్టి కట్టుకథలు అని.. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. 

నిజంగా మీడియాలో కథనాలు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జగన్ నిమ్మగడ్డ రిటైర్మెంట్ తర్వాత తీరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకుందాం అని అనుకుంటున్నారు. నిమ్మగడ్డ ఇలా చేయడం ప్రభుత్వానికి భారీ షాక్ అవుతుంది అని చెప్పాలి. అయితే వైసిపికి అదృష్టవశాత్తు అటువంటిది ఏమి జరగలేదు. ఎన్నికల కమిషన్ ఎటువంటి షెడ్యూల్ విడుదల చేయలేదని ఖరారు చేసింది. ఇక ఇదే సమయంలో కమిషన్ నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటనలు రాకపోయినా సోషల్ మీడియా రిపోర్తుల ద్వారా పలు ఫేక్ షెడ్యూల్స్ ద్వారా ఈ వార్త ప్రచారం చేసిన వారిపై యాక్షన్ తీసుకోనున్నారని సమాచారం. రమేష్ కుమార్ అందుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇలా ఫేక్ పోస్టులు పెట్టి ప్రజలను మోసం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారట. 

ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన షెడ్యూల్ ఏమిటంటే సెప్టెంబర్ 9న ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 11కి పూర్తవుతుందని పోలింగ్ సెప్టెంబర్ 21 న కాగా సెప్టెంబర్ 24న కౌంటింగ్ జరుగుతుందని అన్నారు.  అలాగే మున్సిపల్ ఎన్నికలకు సెప్టెంబర్ 11-13 వరకు నామినేషన్స్ జరిగి…. సెప్టెంబర్ 23 న పోలింగ్, సెప్టెంబర్ 27న ఓట్ల లెక్కింపు ఉంటుంది అని చెప్పారు. అసలే చిరాకు లో ఉన్న నిమ్మగడ్డకు ఈ వార్త బయటకి రావడంతో ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేయించేదాకా ఆయన వదలరని ఎన్నికల కమిషన్ ఆఫీస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju