NewsOrbit
న్యూస్

తిరుమల వాసుడికి జీఎస్టీ కష్టాలు..!! ఆదుకోవాలని కోరిన టీటీడీ చైర్మన్

 

(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రెండు ప్రధాన సమస్యలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా 23.78 కోట్ల రూపాయల జిఎస్టీ రద్దుతో పాటు టీటీడీలో రద్దు అయిన పాత నోట్లు డిపాజిట్ చేసుకునే అవకాశంపై వినతి పత్రాన్ని సమర్పించారు.

ttd chairman yv subba reddy meets central minister nirmala sitharaman

తిరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్) విభాగానికి 2014 ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి జూన్ 30, 2020 వరకూ బకాయి ఉన్న రూ.23,78 కోట్ల జిఎస్‌టీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైవి సుబ్బారెడ్డి కోరారు. జీఎస్‌టీ రద్దు చేయడం వల్ల టీటీడీకి మరింత ఆర్థిక బలం లభిస్తుందనీ, తద్వారా అనేక సామాజిక విద్యా, ధార్మిక కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించే అవకాశం కలుగుతుందని సుబ్బారెడ్డి విన్నవించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500లు, రూ.1000లు రద్దు చేసిన తరువాత హూండీ కానుకల ద్వారా 1.8 లక్షలు వెయ్యి రూపాయల నోట్లు, 6.34 లక్షలు 500 నోట్లు వచ్చాయనీ, వీటిని రిజర్వు బ్యాంకులో గానీ, ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయడానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి నిర్మల సీతారామన్‌ను  వైవీ సుబ్బారెడ్డి కోరారు.

పాత నోట్లు మార్పిడి అంశంపై టీడీడీ 2017 నుండి అనేక మార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాసినా సానుకూల స్పందన లబించలేదని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు సుబ్బారెడ్డి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విన్నవించిన ఈ రెండు ప్రధాన సమస్యలపై కేంద్రం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటో వేచి చూడాలి.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?