NewsOrbit
న్యూస్

పవన్ కల్యాణ్ పేరు చెప్తే మా వల్ల కాదని వారంతా దండం పెట్టేస్తున్నారు !అసలేమైంది ??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసే కొత్త నిర్మాతలకు దర్శకులకు ఆందోళనకరమైన అంశం ఒకటి ఎదురవుతోంది.పవన్ కల్యాణ్ ఆహార్యం వారికి ఇబ్బంది కలగచేస్తోంది. కానీ ఆ విషయం ఆయనకు చెప్పాలంటే ఎవరికీ ధైర్యం చాలడం లేదు.

విషయానికొస్తే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు.2019 ఎన్నికల సమయంలో కాస్త బిజీగా తిరిగారు .ఇక సినిమాలు కూడా చేయనన్నట్లు చెప్పేశారు.ఆ ఎన్నికల ఫలితాలు పవన్ కల్యాణ్కు పెద్ద షాకిచ్చాయి ఆయన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు.సరే షరామామూలే అన్నట్టు మళ్ళీ పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడానికి ముందుకొచ్చారు. నాలుగు సినిమాల్లో నటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు .వకీల్ సాబ్ సినిమా వెంటనే ప్రారంభమైపోయింది కూడా.ఇంతలో కరోనా కారు మేఘాలు చిత్ర పరిశ్రమను కమ్మేశాయి.

 

లాక్ డౌన్ వ‌ల్ల‌, షూటింగులు ఆగిపోయాయి. వ‌రుస‌గా సినిమాపై సినిమా చేద్దామ‌న్న ప‌వ‌న్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. వ‌కీల్ సాబ్ ని పూర్తి చేయ‌డం ప‌వ‌న్ ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యంగా మారింది. షూటింగుల‌కు మ‌ళ్లీ వాతావ‌ర‌ణం అనుకూలించ‌డంతో, మెల్ల‌మెల్ల‌గా స్టార్లంతా బ‌రిలోకి దిగుతున్నారు. ప‌వ‌న్ సైడ్ నుంచి కూడా అంతా ఓకే. వ‌చ్చే నెల‌లోనే `వ‌కీల్ సాబ్` షూటింగ్ మొద‌లుకానుంది. ప‌వ‌న్ కూడా బ‌రిలో దిగ‌డానికి సిద్ధంగానే ఉన్నాడు. కాక‌పోతే.. ప‌వ‌న్ ఫిట్ నెస్‌పైనే ద‌ర్శ‌కుల బెంగ‌. లాక్‌డౌన్ తో పవన్ బ‌రువు పెరిగాడు. గెడ్డం, జుత్తూ పెంచి – హీరో లుక్‌కి చాలా దూరం నిల‌బ‌డ్డాడు. ప‌వ‌న్ ఇది వ‌ర‌క‌టి షేప్ లోకి రావ‌డానికి కాస్త టైమ్ ప‌డుతుంది. ఇప్పటి నుంచి ప‌వ‌న్ త‌న ఫిట్ నెస్‌పై దృష్టి పెడితే త‌ప్ప – షూటింగులు మొద‌ల‌య్యేస‌రికి ఫిట్ గా మార‌డు.

కానీ.. ప‌వ‌న్ ఫిట్ నెస్ పై ఏమాత్రం గురి పెట్ట‌లేన‌ట్టు తెలుస్తోంది. పైగా ప‌వ‌న్ ఇప్పుడు దీక్ష‌లో ఉన్నాడు. ఈ స‌మ‌యంలో.. ఫిట్ నెస్ గురించి ఆలోచించ‌డం కూడా క‌ష్ట‌మే. వ‌కీల్ సాబ్ లో లుక్ కీ, ఇప్ప‌టి లుక్ కీ చాలా తేడా వుంది. ఆ విష‌యం గుర్తు చేసి, ఫిట్ నెస్ పై దృష్టి పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇవ్వ‌డానికి ద‌ర్శ‌కుల‌కూ, నిర్మాత‌ల‌కూ ధైర్యం స‌రిపోవ‌డం లేదు. ప‌వ‌న్ త‌నంత‌ట తాను గ్ర‌హించి, మ‌ళ్లీ క‌స‌ర‌త్తులు మొద‌లెడితే గానీ, హీరో లుక్ లోకి మార‌డు. ప‌వ‌న్ కోసం ప్ర‌త్యేక‌మైన ట్రైన‌ర్ ని, లుక్ ని మార్చాల‌ని దిల్ రాజు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు క్రిష్‌కీ ఇదే ఆలోచ‌న వ‌చ్చింది. కానీ.. దాన్ని ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్ల‌డానికి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చెప్పలేని పవన్ తన ఫిట్నెస్ గురించి దర్శక నిర్మాతలు చెబితే వింటాడా లేక వారినే ఏమన్నా అంటాడా అన్నది జవాబు దొరకని ప్రశ్న !

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju