NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీలో జ‌గ‌న్‌… టెన్ష‌న్‌లో బాబు?

Tirupathi By Elections; Nandyal - Jagan - chandrababu Variations

కీల‌క స‌మ‌యంలో వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ టూర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది.

మంగ‌ళ‌వారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరిన‌ సీఎం జగన్ అనంత‌రం ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో స‌మావేశం అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిషాతో స‌మావేశం అయిన వైఎస్ జ‌గ‌న్ వీరితో పాటుగా పలువురు బీజేపీ అగ్రనేతలతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, ప్రతిపక్షాల దూకుడుగా వెళ్తున్న తరుణంలో వైఎస్‌ జగన్ ఢిల్లీ టూర్ అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటోంది.

ఢిల్లీ టూర్‌…ఎన్ని లెక్క‌లంటే….

ప్రస్తుతం రాజకీయ పరిణామాలు హీటెక్కిన వేళ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ టూర్లో అనేక అంశాలు భాగం కానున్న‌ట్లు అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. రాజధాని భూముల అక్రమాలపై సీబీఐ విచారణ చేయాల‌ని ఇప్పటికే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు.. ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇదే విష‌యాన్ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో పాటుగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం జగన్ సమవేశమయ్యే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ, కోవిడ్‌ 19 తదితర అంశాలపై వివరించే అవకాశముంది. పోలవరం, ఉపాధి హామీ నిధులు పెండింగ్‌ నిధుల విడుదలపై వారితో చర్చించనున్నారని స‌మాచారం.

అమిత్‌షాతో స‌మావేశంతో హీట్‌…

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇటీవలే ఆయన కరోన నుంచి కోలుకున్న నేపధ్యంలో అమిత్ షా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పెండింగ్ అంశాలపై అమిత్ షా కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ విజ్ఞాపన పత్రం అందచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మూడు రాజధానుల ఏర్పాటు,పెండింగ్ నిధుల విడుదల గురించి ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తు, అమరావతి భూ కుంభకోణం,ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అంశాలను అమిత్ షా దృష్టికి జగన్ తీసుకెళ్లినట్టు స‌మాచారం. దీంతో పాటుగా ఏపీలో పరిస్థితులపై హోం మంత్రికి వివరణ ఇచ్చారని స‌మాచారం.

టెన్ష‌న్‌లో బాబు టీం?

కాగా, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ వ‌ర్గాలు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నాయి. వైసీపీ అధినేత ఢిల్లీ టూరుతో తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. అమ‌రావ‌తి భూ కుంభ‌కోణం, ఫైబ‌ర్ గ్రిడ్ అవినీతి స‌హా ఇత‌ర అవినీతి ప‌ర్వంపై విచార‌ణ జ‌రుగుతుందేమోన‌ని సైకిల్ పార్టీ నేత‌లు టెన్ష‌న్ పడుతున్నార‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?