ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరి వద్ద సెల్ ఫోన్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలం టెక్నాలజీ కాలం కాబట్టి. ఇక అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా సెల్ ఫోన్ లేనిదే బయటకు పోవడం కాదు అసలు లేవడం లేదు.
ఉదయం నుంచి రాత్రి వరకు సెల్ ఫోనే. ఇక అందులో సోషల్ మీడియా. ఎప్పుడు సోషల్ మీడియాకు అతుక్కుపోయ్ ఉంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అని ఎప్పుడు అక్కడే ఉంటారు. ఇక టిక్ టాక్ లు, రీల్ అని ఇలా డ్యాన్సులు చేస్తూ వారి టాలెంట్ ని ప్రదర్శిస్తూ ఫేమస్ అయిపోతుంటారు.
కరోనా వైరస్ రావడం వల్ల రెండో క్లాస్ చదివే పిల్ల వద్ద కూడా ఆన్లైన్ క్లాస్ అంటూ ఫోన్ లు ఉంటున్నాయ్. అలాంటిది ఓ వ్యక్తి తన కోడుకుకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్తూ వింత కోరికలు కోరాడు. తనకు కోడలుగ వచ్చే అమ్మాయికి సెల్ ఫోన్ అలవాటు ఉండకూడదని, ఫేస్ బుక్ పిచ్చి అసలు ఉండకూడదని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ”ఎటువంటి కట్న కానుకలు ఆశించని వరుడికి తెలుపు, అందం, ఎత్తు పొడవు, సన్నగా ఉండే వధువు కావలెను. వధువు సోషల్ మీడియాకు బానిస అయ్యి ఉండకూడదు” అంటూ ప్రకటనలో తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. నీకు ఈ జన్మలో పెళ్లి కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Prospective brides/grooms please pay attention.
Match making criteria are changing ? pic.twitter.com/AJZ78ARrHZ
— Nitin Sangwan (@nitinsangwan) October 3, 2020