మన శరీరం అనారోగ్యానికి గురికాకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసినన్ని పోషకాలు అందుతాయి. మన శరీరానికి ఎక్కువగా ప్రోటీన్లు అవసరం అవుతాయి కాబట్టి, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రొటీన్లు పుష్కలంగా లభించే పెసరపప్పుతో రకరకాల వంటలను చేసుకుని తినడం ద్వారా మన శరీరానికి కావలసినన్ని ప్రొటీన్లు అందుతాయి..
ఈ పెసరట్టు ఎంతో రుచిగా,అలాగే చేయడానికి ఎంతో సులభతరంగా ఉంటుంది కాబట్టి ఎక్కువమంది దీనిని ఉదయం అల్పాహారంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీనికి మరింత రుచి రావటం కోసం కొందరు ఉల్లిపాయలను, కొందరు పన్నీరు వేసుకొని ఎంతో ఇష్టంగా తింటున్నారు.
మొలకెత్తిన పెసర గింజలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మధుమేహంతో బాధపడేవారు ఈ మొలక గింజలను ఎక్కువగా తీసుకుంటారు. పెసరపప్పు మొలక గింజలను తినడం ద్వారా మన శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్స్ చేరుతాయి.
సాయంత్రం సమయంలో స్నాక్స్ మాదిరిగా పెసర పకోడీలు మాదిరిగా తయారు చేసుకుని తింటారు. ఈ పెసర పకోడీలను మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా స్నాక్స్ మాదిరిగా తింటారు.
కొంతమంది పెసరపప్పుతో సమోసాలు తయారు చేసుకుని సాయంత్రం స్నాక్స్ లాగా తింటారు.
పెసరపప్పును దోరగా వేయించి బెల్లం లేదా చక్కెరను కలిపి పాయసం చేసుకుని తినడం ద్వారా మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో ఈ పెసర పప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. మధుమేహంతో బాధపడే వారు కూడా బెల్లంతో తయారుచేసిన పాయసం తాగవచ్చు.