NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ దక్షతకు అగ్నిపరీక్ష పెడుతున్న ఆ రెండు అంశాలు! వాట్ నెక్స్ట్?

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అతి కీలకమైన రెండు అంశాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కనుక మెతకవైఖరి అవలంబిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం అయ్యే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.కేంద్రం మెడలు వంచైనా ఆ రెండు అంశాలలో సానుకూల ఫలితాలను రాబడితేనే జగన్ కి భవిష్యత్తు ఉంటుందని వారు చెబుతున్నారు.ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ఆ రెండు అంశాలను జగన్ పక్కనబెడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు.అయితే ఆ రెండూ కూడా ఇప్పుడు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి.

 Those are the two things that are testing the efficiency of ys jagan
Those are the two things that are testing the efficiency of ys jagan

అందులో ఒకటైన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎప్పుడో తలుపులు మూసేసింది.కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు ఎంపీలను అధిక సంఖ్యలో ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని అన్నది బహిరంగ ప్రకటన చేశారు.మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వైసిపి ఎంపీలు ఇరవై రెండు మంది గెలిచారు.సంఖ్యాబలం దృష్ట్యా లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ వైసిపి.అయినప్పటికీ వైసిపి ఎంపీలు గానీ జగన్ గానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయడం అటుంచి అసలు ఆ ఊసే ఎత్తటం మానేశారు.స్వాతంత్ర దినోత్సవ సందేశంలో జగన్ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినప్పటికీ ఆ తదుపరి ఫాలోఅప్ యాక్షన్ లేదు. హోదా వచ్చి ఉంటే కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి తరలి వచ్చి అనేక విధాలుగా ప్రయోజనం కలిగే అవకాశాలు ఉండేవి. ఇక తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే కేంద్రం పెద్ద మెలికే పెట్టి ఏపీ ప్రభుత్వం నెత్తిన గుదిబండ మోపింది.ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే ఇస్తామని, పునరావాస ప్యాకేజీ తో తమకు సంబంధం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది.

 Those are the two things that are testing the efficiency of ys jagan
Those are the two things that are testing the efficiency of ys jagan

పోలవరం ప్రాజెక్టు వ్యయం యాభై అయిదు వేల కోట్ల రూపాయలు కాగా కేంద్రం ఇస్తానంటోంది కేవలం ఇరవై వేల కోట్లు.మిగతా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది సాధ్యమయ్యే పనికాదు.పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిది.దాన్ని పూర్తి చేయలేకపోతే భావితరాలవారు పాలకులను క్షమించరు.పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో జగన్ కూడా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని నానా మాటలు అన్నారు.ఇప్పుడు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ఏమీ చేయలేని పక్షంలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందు ఆయన తలదించుకోవాల్సి వస్తోంది.కేంద్రానికి అవసరమున్నా లేకున్నా మద్దతిస్తున్న వైసీపీ ఈ రెండు విషయాల్లో గట్టిగా పట్టుబట్టి ప్రధానిని ఒప్పించగలిగితేనే జగన్ తెలుగు ప్రజలకు ముఖం చూపించగలరని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?