NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ ప్రశంస.. ! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

 

ఏపి సీఎం వైఎస్ జగన్, ఏపి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం సీఎం వైఎస్ జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.  నాడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆ కోపం నిమ్మగడ్డ పదవీకాలం తగ్గించి ఇంటికి పంపించే వరకూ తీసుకువెళ్లింది. ఆ తరువాత నిమ్మగడ్డ హైకోర్టు ఉత్తర్వులతో తమ పదవికి మళ్లీ వచ్చారు. ఈ మధ్య కాలంలో కొద్ది రోజులు తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కనకరాజ్ ఎస్ఈసీగా బాధ్యతలూ నిర్వహించారు. నిమ్మగడ్జ కూడా తనకు భధ్రత కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం, ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించడం లేదనీ, నిధులు విడుదల చేయడం లేదనీ హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డకు వైసీపీ నేతలు చంద్రబాబు మనిషి అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉండగా ప్రభుత్వం, వైసీపీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు రాష్ట్రంలో లేవని పేర్కొంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అంటూ హెచ్చరికలు వస్తున్నాయని కారణం చెబుతున్నారు.

రాష్ట్రంలో కరోనా తగ్గినట్లే

ఇది ఇలా ఉంటే నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఒ విషయంలో ప్రశంసించడం ఆశ్చర్యాన్ని కల్గించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యల కారణంగా రాష్ట్రంలో కరోనా చాలా వరకు తగ్గిందన్నారు. కరోనా కేసుల సంఖ్య పది వేల నుండి 753కి తగ్గిపోయాయని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషే కారణమని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ విధంగా నిమ్మగడ్డ ఎందుకు మాట్లాడారు అంటే రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గింది కాబట్టి  ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు లేవన్న భావనతో అన్నమాట.   తెలంగాణలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు..?

ఎన్నికలు నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లేదనీ, పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని నిమ్మగడ్డ పేర్కొన్నారు.  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని అన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు అందరూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు.  ఆరోగ్య శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు నిమ్మగడ్డ, స్వేచ్చాయుత వాతావరణంలో, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N