NewsOrbit
న్యూస్ మీడియా రాజ‌కీయాలు

కోవిడ్ గుడ్ న్యూస్ః టీకా ధ‌ర జ‌స్ట్ వెయ్యి రూపాయ‌లే… ఎప్పుడు వచ్చేస్తుందంటే….

దేశంలో ఇప్పుడు అంద‌రి చూపు కోవిడ్ వ్యాక్సిన్ పైనే. ఏ సంస్థ రూపొందించే వ్యాక్సిన్ అయిన‌ప్ప‌టికీ, ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంది? ఎంత ధ‌ర ఉంటుంద‌నే వివ‌రాలు ఆరా తీయ‌డంలో ప్ర‌జ‌లు ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌న దేశానికి చెందిన ఓ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పూణేకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

 

వ్యాక్సిన్ ఎవ‌రికి ముందు ఇస్తారంటే…

ఆక్స్‌ఫర్డ్‌ రూపొందించిన టీకాను స్వీడిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి పూణేకు చెందిన సీరం ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ‘కోవిషీల్డ్‌’ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని గురించి హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2020లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూణావాలా కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్‌ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని తెలిపారు. ప్రజలకు వ్యాక్సిన్‌ రెండు డోసులు రూ.1000కే అందుబాటులో ఉంటుందని చెప్పారు. కేవలం ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు పరిమిత ఉపయోగం కోసం మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. తుది పరీక్షల ఫలితాలు, నియంత్రణ అనుమతులపైనే వ్యాక్సిన్‌ లభ్యత ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.అత్యవసర వినియోగం కోసం ఎస్‌ఐఐ ఎప్పుడు దరఖాస్తు చేస్తుందనే ప్రశ్నకు స్పందిస్తూ యూకే, యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఎవాల్యుయేషన్‌ ఏజెన్సీ (ఈఎంఈఏ) ఆమోదించిన వెంటనే దేశంలో పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.

టీకా ఎలా ప‌నిచేస్తుందో తెలుసా?

త‌మ వ్యాక్సిన్‌ టీ సెల్స్‌ ప్రతిస్పందననను ప్రేరేపించిందని అద‌ర్ పూణావాల తెలిపారు. దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి, యాంటీబాడీ ప్రతి స్పందనకు సూచిక అనీ, అయితే టీకాలు దీర్ఘకాలికంగా రక్షిస్తాయో లేదో సమయం మాత్రమే చెబుతుందని, ప్రస్తుతం టీకాలకు ఎవరూ సమాధానం చెప్పలేరని పూనావాలా అన్నారు. వ్యాక్సిన్‌ సమర్థతపై మాట్లాడుతూ ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వృద్ధుల్లో బాగా పని చేస్తోందని రుజువు చేస్తోందన్నారు. వ్యాక్సిన్‌ పిల్లలకు వేసేందుకు మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుందని, శుభవార్త ఏంటంటే పిల్లల్లో కొవిడ్‌-19 తీవ్రత లేదని చెప్పారు. మీజిల్స్‌ న్యుమోనియా మాదిరిగా కాకుండా వైరస్‌ ప్రాణాంతకమైందని, మహమ్మారి పిల్లల్లో రిస్క్‌ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని, అయితే వాహకాలుగా మాత్రం మారవచ్చని, ఇతరులకు ఇన్ఫెక్షన్‌ సోకవచ్చన్నారు.

మ‌నంద‌రికీ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుందంటే….

ప్రతి భారతీయుడికి టీకాలు వేయడానికి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని అద‌ర్ పూణావాల తెలిపారు. 2024 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా వేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే సరఫరాలో అవరోధాలు, అవసరమైన బడ్జెట్‌, వ్యాక్సిన్‌, లాజిస్టిక్స్‌, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సంసిద్ధత అవసరమన్నారు. ఫిబ్రవరి నుంచి నెలకు సుమారు పది కోట్ల డోసులను తయారీ చేయాలని సీరం ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా యోచిస్తోంది. ఇండియా తమ ప్రాధాన్యమని, ఈ సమయంలో సీరం ఇసిస్టిట్యూట్‌ ఇతర దేశాలతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం లేదని పూనావాలా స్పష్టం చేశారు.

 

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N