NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డికి పీసీసీ పదవికి కట్టబెడితే ఫస్ట్ పార్టీ నుండి బయటకు వెళ్ళేది నేనే అంటున్న ఆ సీనియర్ నేత…!!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో టీ కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లు బట్టి చూస్తే.. కాంగ్రెస్ ఓటుబ్యాంకు మొత్తం కుప్పకూలిపోయింది అని చాలా మంది చెప్పటం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా గాని తెలంగాణలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధికారంలో కి రాలేదు. దీనంతటికి కారణం పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఐక్యత లేకపోవడమే అని చాలామంది చెబుతుంటారు.

V Hanumantha Rao Tests COVID-19 Positiveపార్టీలో ఉన్న సీనియర్ నాయకులు తమ స్వార్ధ రాజకీయాలకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నాశనం చేశారని పార్టీ కేడర్ లో టాక్ ఎప్పటి నుండో ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల దుబ్బాక మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో, ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

 

ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టాలి అనే దాని విషయంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ ద్వారా పార్టీలో సీనియర్ నాయకుల దగ్గర అభిప్రాయాలు తీసుకుని దాన్ని ఓ నివేదిక ఆధారంగా చేసుకుని పీసీసీ పదవి ప్రకటించడానికి రెడీ అవుతుంది. ఇటువంటి తరుణంలో పీసీసీ పదవి కచ్చితంగా రేవంత్ రెడ్డికి వస్తుందని టాక్ గట్టిగా వస్తున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి కట్టబెడితే పార్టీ నుండి ఫస్ట్ బయటకు వెళ్ళేది నేనే అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. నేను మాత్రమే కాక చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోతారని వి హనుమంత రావు పేర్కొన్నారు. పార్టీకోసం ఎప్పటినుండో పనిచేసిన జగ్గారెడ్డి, కోమటిరెడ్డి పనికిరారా అంటూ ఎదురు ప్రశ్నించారు. అంత మాత్రమే కాక సోనియా అదేవిధంగా రాహుల్ గాంధీని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?