NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

రాధ.. రాజకీయం రాదా!!

 

 

వంగవీటి రంగా వారసుడిగా అందరికీ సుపరిచితుడై, మృధుస్వభావిగా, వివాదారాహితుడిగా ముద్రపడి.. బెజవాడ రాజకీయాల్లో గ్రూపు తగాదాలు లేకుండా శాంతి స్వభావంతో ముందుకు సాగిన వంగవీటి రాధ… రాజకీయ ప్రయాణం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది… నిన్నమొన్నటి వరకు టీడీపీతో అంత కాకి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రాధ తాజాగా తన రూటు మార్చినట్లు గా అర్థం అవుతోంది. వంగవీటి రాధా కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తో రాధా ఏకాంతంగా జరిపిన చర్చలు కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి.

** వంగవీటి రాధా కు కాపుల్లో మంచి పేరుంది దాదాపుగా పరంగానూ కాపులంతా తమవాడిగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో సుమారు 18 శాతం వరకు ఉన్న కాపులు.. వంగవీటి రాధా ఎక్కడికెళ్లినా ఆదరిస్తారు. తమ ఆరాధ్య దైవం వంగవీటి రంగా వారసుడిగా ఆయనను గుర్తించడమే దానికి కారణం.
** రంగా వారసుడిగా కాపులంతా గుర్తించిన దానికి తగిన రాజకీయాన్ని చూపడం లేదనేది ప్రధాన విమర్శ. ఎంతో సైలెంట్ గా తన పని తాను తీసుకుంటారని కనీసం కాపులను ఐక్య పరిచే సభలు సమావేశాలు నిర్వహించాలని… కాపులుగా దన్నుగా నిలబడిన సందర్భాలు రాధా చేయలేదు అన్నది ప్రధాన అభియోగం.
** కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి గెలిచిన రాధా తరువాత తూర్పుకు షిఫ్ట్ అయ్యారు. కృష్ణలంక ప్రాంతం విజయవాడ తూర్పు నియోజకవర్గం లోకి రావడమే దీనికి ప్రధాన కారణం. కృష్ణలంక ప్రాంతం నుంచే ఇది రంగా అన్న రాధా రాజకీయాలు మొదలు పెట్టారు. ఇదే ప్రధాన అడ్డాగా వంగవీటి వంశానికి మారింది. దీంతో రంగా తనయుడు రాధా ప్రతిసారి విజయవాడ తూర్పు టికెట్ కోసం ప్రతి పార్టీ నుంచి ప్రయత్నాలు చేస్తుంటారు.
** కాంగ్రెస్ పార్టీ నుంచి మద్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాధా తర్వాత తూర్పు టికెట్ కోరగా కాంగ్రెస్ రాజకీయాలు తట్టుకోలేక బయటికి వచ్చారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున మరోసారి మధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. విజయవాడ పశ్చిమ తూర్పు నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలుగా వెల్లంపల్లి శ్రీనివాస్, ఎలమంచిలి రవి గెలిచిన ఎంతో పట్టున రాధ రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనికి విజయవాడ తూర్పు టికెట్ రాధాకు కావాలని ఇవ్వలేదనే ది పెద్ద ఆరోపణ.
** ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న రాధ మళ్లీ జగన్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. వైయస్సార్ సిపి తరపున పని చేశారు. ఎక్కడ కూడా మరోసారి రాధాకు తూర్పు టికెట్ వేదనే వివాదం వచ్చింది. దీంతోపాటు జగన్ తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని రాధా అలక బోని పార్టీ నుంచి బయటకు వచ్చారు.
** వైయస్సార్సీపి నుంచి బయటకు వచ్చిన రాధ సైలెంట్ గా ఉంటే బాగుండేది. అయితే ఆయన టిడిపి పంచన చేరడం రాధా అభిమానులకు రంగా అభిమానులకు ఎక్కడ రుచించలేదు. రంగా ను రాజకీయంగా దెబ్బతీసిన… రంగా హత్య లోను తెదేపా నాయకుల హస్తం పై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాధ టిడిపి వైపు వెళ్లడం రంగా అనుచరులకే నచ్చలేదు.
** 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున పార్టీలో ఉన్న వంగవీటి రాధా కు తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి మొండిచేయి చూపారు. ఎక్కడ టికెట్ కేటాయించకుండా కేవలం రాధ ను వాడుకున్నారు. అప్పట్లోనే రంగా అనుచరులు అంతా జనసేన పార్టీలోకి రాదా వెళితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
** ప్రస్తుతం వంగవీటి రాధా అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి తో అంటీ ముట్టనట్లుగానే ఉన్న రాధా ఇప్పుడు పూర్తిగా పార్టీకి గుడ్బై చెబుతారని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న జనసేన పార్టీ లోకి రావాల్సిన టైం లో రాదా వస్తారనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం.
** ఏదిఏమైనా వంగవీటి రాధ రాజకీయ పరిపక్వత విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు మారిన రాధా ఇప్పుడైనా ఒక పార్టీని నమ్ముకుని ఉంటే మంచి పొజిషన్లో ఉండేవారని కాపులు ఐక్యతకు ఆయన కృషి చేస్తే రంగా పేరు వచ్చినట్లుగా వచ్చేదని… రంగా అనుచరులు వ్యాఖ్యానించడం రాధ రాజకీయ వ్యవహారాలకు అద్దం పడుతుంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju