బిగ్ బాస్ నాలుగో సీజన్ భారీ హిట్. ఇక రియాల్టీ షో కాన్సెప్ట్ అయితే తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఏకంగా నాలుగు సీజన్లల ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ప్రతి సీజన్లో 1 విన్నర్, ఒక రన్నరప్ ఉంటారు. ఇద్దరికీ టైటిల్ సాధించేందుకు సమానమైన అవకాశాలు ఉన్నప్పటికీ చివరి దశలో ఎవరో ఒకరు ముందంజ వేస్తారు.
ఇక ఈ సీజన్లో అభిజిత్-అఖిల్ మధ్య వార్ ఆసక్తికరంగా సాగింది ఈ. నేపథ్యంలో బిగ్బాస్ ముగిసిన తర్వాత వీరిద్దరూ బాగా బిజీ అయిపోయారు. ఇక తాజాగా విన్నర్ అభి పై అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో అందరూ బయటికి వచ్చిన తర్వాత పూర్తి బిజీ అయిపోయారు. ఇంటర్వ్యూలు, లైవ్ చాట్ లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
మోనాల్ గజ్జర్ విషయం మాట్లాడుతూ అభిజిత్ పై అఖిల్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మోనాల్ గురించి జరిగే గొడవ గురించి మాట్లాడుతూ నేను ఈ విషయం అభి తో మాట్లాడడానికి చాలా ట్రై చేశాను. కానీ ఆయనే రీయాక్ట్ కాలేదు. అసలు ఆ విషయాన్ని గొడవ జరగకుండా క్లియర్ చేసేందుకు ప్రయత్నించాడని ఆమె కూడా మాట్లాడతాను అని చెబితే అడిగాను కానీ నాకు ఒక టైం కావాలి అన్నాడు ఆ తర్వాత ఆ విషయం స్పందించలేదు దీంతో వాళ్ళ మధ్య దూరం అలాగే ఉండిపోయింది అని చెప్పాడు.
ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా అభిజిత్ పై అఖిల్ ఇలాంటి కామెంట్స్ చేయడం అభి అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.