ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సమంత. ఆడియెన్స్ ఈ సినిమాలో నాగచైతన్య మరియు సమంత ల కెమిస్ట్రీకు ఫిదా అయిపోయారు. కొన్ని సంవత్సరాల తరువాత రియల్ లైఫ్ లో కూడా తమ కెమిస్ట్రీ ఇంతే పర్ఫెక్ట్ గా వర్కవుట్ అవుతోందని భావించి పెద్దలని ఒప్పించి వివాహమాడారు నాగచైతన్య మరియు సమంత.
ఐతే, వివాహానికి ముందు సమంత హీరోలతో ఒక సాధారణ హీరోయిన్ గా డ్యూయెట్స్ పాడే పాత్రల్లో నటించింది. హీరోలను కవ్వించే పాత్రలు చేసి ప్రేక్షకులకు కనువిందు చేసింది. కానీ పెళ్లి అయ్యాక అక్కినేని కోడలుగా మారాక సమంత అటువంటి పాత్రలకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఒకవేళ అలంటి పాత్రలు చెయ్యాలిసివస్తే కేవలం నాగ చైతన్య పక్కనే కనిపిస్తుంది. ఆ పాత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అనిపిస్తేనే సమంత ఆ పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. “యూ టర్న్”, “మహానటి”, అలాగే “ఓ బేబీ” సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. అలాగే, ఒకపక్కన సమంత సినిమాలు చేస్తూనే మరొపక్కన తన హోస్టింగ్ స్కిల్స్ తో కూడా ప్రేక్షకుల మన్ననను పొందుతుంది. ‘ఆహా’ లో ప్రసారమవుతున్న ‘సామ్ జామ్’ షో తో సందడి చేస్తుంది.
అలాగే త్వరలో ఒక పౌరాణిక చిత్రంలో కూడా సామ్ కనిపించనున్నట్లు సమాచారం. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనున్న “శకుంతలం” సినిమా లో సందడి చేయనున్నది. ఈ సినిమా లో సమంత ది చాలా కీలకమయిన పాత్ర కావడంతో ఇది సామ్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలవనున్నదట.
అయితే, స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్స్ కు కేవలం పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ రావడం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ నేపథ్యంలో సమంతకు స్టార్ హీరోస్ తో ఎక్కువగా ఆఫర్స్ రావడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.