NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబుకి జమిలీ జబ్బు పట్టుకుంది..! వదిలేదెలా?

టిడిపి అధినేత చంద్రబాబు మైండ్లో ఇప్పటికే చాలా విషయాలు రన్ అవుతూ ఉంటాయి. పార్టీలో అనేక సమస్యలు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు, దేవాలయాల గొడవలుఎన్నో మరెన్నో ఉన్నాయి. అయితే ఎంతో విచిత్రంగా ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అందరికీ జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని తొందర పెడుతున్నారు. అసలు దాని వెనుక బాబు లెక్క ఏమిటి నిజంగా జమిలి ఎన్నికలు త్వరలో వచ్చేస్తాయా?

 

ఒకటే కలవరింపు..!

జమిలి ఎన్నికలు రావచ్చేమో అని నరేంద్ర మోడీ చెప్పారు కాబట్టి అవి అతి త్వరలో వస్తాయి అన్నది టీడీపీ అధినేత అంచనా. అయితే మోదీ ఈ విషయంపై ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా జమిలి ఎన్నికలు జరపాలంటే పరిస్థితులు ఎంత మాత్రం సానుకూలంగా ఉంటాయో ఎవరికీ కనీస ఐడియా లేదు. కానీ ఏ జిల్లా నేతలతో మాట్లాడినా చంద్రబాబు మాత్రం జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నేతలతో కూడా జమిలి ఎన్నికలు వస్తున్నాయని అందరూ సిద్ధంగా ఉండాలని కార్యకర్తలందరికీ సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

అంత వీజీ కాదు..!

అయితే ఇక్కడ అందరికీ అనేక అనుమానాలు వస్తున్నాయి. నిజంగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించాలని అంత పట్టుదలతో ఉంటే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఏడాదిలో ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల పేరుతో ఆపివేయవచ్చు. అయితే ఈ ఎన్నికలు పెట్టేందుకు ముందు అన్నీ రాష్ట్రాల అసెంబ్లీలలో వాటికి ఆమోదం జరగాలి. బిజెపి పాలిత రాష్ట్రాలు తప్పించి మిగతా వాటిల్లో వ్యతిరేకత వస్తే అది ఒక తలనొప్పి. క్యాబినెట్ తీర్మానం అంటే మోడీ చేతిలోనే కాబట్టి అయిపోతుంది. మరి పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం అంత సులువైన విషయం అయితే కాదు. బిజెపి పాలిత రాష్ట్రాలు కాకుండా మిగిలిన వారు వ్యతిరేకిస్తారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు.

ఇంతకీ బాబు ధైర్యం ఏమిటి?

ఇక ఈ లోపల దీనిపై కోర్టు కేసులు వస్తే? కొనసాగుతున్న రైతుల ధర్నాల సంగతి ఏంతి? మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో బిజెపి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదో అందరి మూడ్ ఎలా ఉంటుందో చూద్దామని మోదీ ఒక మాట ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే బాబు మాత్రం దీనిని ఒక మంత్రంలా జపిస్తున్నారు. ఎంతవరకు వీలైనంత త్వరగా అఖండ మెజారిటీ ఉన్న వైసిపి పార్టీని ప్రభుత్వం నుండి దింపేయాలని…. జగన్మోహన్రెడ్డిని ప్రతిపక్షానికి పంపేయాలని పట్టుదలతో ఉన్నాడు. కానీ అసలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమిటో చంద్రబాబు కి అర్థం కావట్లేదు అని అందరూ అంటున్నారు. అసలు నిజంగా జమిలి ఎన్నికలు వచ్చాయనే అనుకుందాం…. బాబు ఏ నమ్మకంతో వైసీపీని ఎదుర్కునేందుకు ఇలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు…!

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !