Obesity Diabetes : ప్రస్తుతం ఆహారపు అలవాట్ల కనుగుణంగా ప్రతి ఒక్కరి ఆహార విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే శరీర బరువు అమాంతం పెరిగి పోతున్నారు. కాస్త బరువు ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువ బరువు అయితే అది స్థూలకాయంగా మారుతుంది.స్థూలకాయంతో బాధపడే వారిలో ఎక్కువగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడిన వారిలో ఎక్కువగా అధిక బరువు ఉన్న వారెనని నిపుణులు చెబుతున్నారు. అయితే మనం డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా మన శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
శరీర బరువు పెరగడానికి గల కారణం గంటలతరబడి కూర్చొని పనిచేయడం లేదా ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగిపోతారు. ఈ విధంగా శరీర బరువు పెరిగినప్పుడు మన శరీరానికి తగిన వ్యాయామం చేయటం, సరైన పోషకాహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీర బరువును క్రమంగా తగ్గించుకోవచ్చు. మన శరీరానికి తగ్గ బరువు ఉండటం వల్ల మనము ఎలాంటి ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.
సాధారణ శరీర బరువుతో పోలిస్తే శరీర బరువు అధికంగా ఉన్న వారిలో డయాబెటిస్ బారిన పడుతున్నట్లు తాజాగా నిపుణులు తెలియజేశారు. ఈ క్రమంలోనే 65 సంవత్సరాలు పూర్తి కాకముందే ఎంతోమంది తనువు చాలిస్తున్నారు. వీలైనంత వరకు సరైన పోషకాహారాన్ని తీసుకుంటూ, శరీరానికి తగ్గ వ్యాయామాలు చేయటం ద్వారా మన శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.దీని ద్వారా మనం టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. అయితే ప్రస్తుతం స్థూలకాయంతో ఎక్కువగా డయాబెటిస్ బారిన పడినవారు అమెరికాలో ఎక్కువగా ఉన్నారు.