NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

Cricket : ఇండియా మణిహారం… మొతేరా స్టేడియం! డే అండ్ నైట్ టెస్ట్ కు సిద్ధం!

Cricket : ఇండియాకు ఎన్నో విశిష్టతలు ఉండొచ్చు. ఇక్కడ అనేక వింతల కూ చోటు ఉండొచ్చు. అయితే భారతీయులందరినీ ఏకం చేసేది మాత్రం క్రికెట్ ఒక్కటే. ఇది జాతీయ మతం గా తయారయింది. బిజీ బిజీ జీవనంలో గడిపే ఎంతోమందికి క్రికెట్ ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్. అందుకే క్రికెట్ పేరుమీద భారతదేశంలో కొన్ని వేలాది కోట్ల వ్యాపారం జరుగుతుంది. క్రికెట్ ఆటగాళ్లను దేవుళ్ళు గా కొలుస్తారు.   ఇప్పుడు ఇండియాలో క్రికెట్ ఆడడానికి అతిపెద్ద మైదానం సైతం అందుబాటులోకి వచ్చింది. అదే గుజరాత్లోని మొతేరా స్టేడియం. ఈ మైదానం గురించి ప్రతి విషయం వింతే. అన్నీ అంశాలు కొత్తే. భారతదేశానికి లార్డ్స్ మైదానం ఇదే అవుతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

Cricket
Cricket

Cricket  ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేడియం

మోతేరా స్టేడియం కోసం కేవలం భారత దేశమే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది అని క్రీడా పండితులు చెబుతున్నారు. ఈ మైదానానికి ఉన్న విశిష్టత లు చాలా గొప్ప అని వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం గా ఇది అవతరించు బోతోంది.   క్రికెట్ చరిత్రలో అత్యంత ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడిన స్టేడియం ఇదే.మరో రెండు రోజుల్లో ఈ మైదానంలో తొలి అంతర్జాతీయ డే అండ్ నైట్ టెస్ట్ భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరగనుంది. ఈ సమయంలో అందరి దృష్టి అత్యంత పెద్దది అయిన ప్రతిష్ఠాత్మకమైన మోతేరా స్టేడియం మీద పడింది. ఈ సమయంలో ముదిరాజ్ స్టేడియం విశేషాలను ఒకసారి పరిశీలిద్దాం.

** మోతేరా స్టేడియం సామర్థ్యం లక్షా పదివేలు. ఒకేసారి లక్ష మంది కూర్చొని క్రికెట్ను ఆస్వాదిస్తుంటే ఆ మజా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ప్రపంచంలో ఏ క్రికెట్ స్టేడియం లోనూ ఎంత సామర్థ్యం లేదు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలోని ఎం సి జి 1,00,24 మందితో ఉన్న రికార్డును మొతేరా బద్దలు కొట్టడం ఉంది. మైదానం నిర్మాణం కోసం ఏకంగా ఎనిమిది వందల కోట్లు ఖర్చయింది. ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే ఉత్తర కొరియాలోని రన్ గ్రాడో మైదానం 1,14,000 సామర్థ్యంతో అతిపెద్దదిగా ఉంది. మీ తర్వాతి స్థానం మనదే రాదే. గతంలో ఇక్కడ పాత స్టేడియం ఉంది దానిని పూర్తిగా పునరుద్ధరించి కొత్త స్టేడియం నిర్మాణం చేసారు.

** 1982 లో గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్లోని సబర్మతి నది ఒడ్డున ఏకంగా వంద ఎకరాలను కేటాయించింది. ఆ స్థలం అప్పటి నుంచి అలాగే ఉంది. ఇక్కడే పాత స్టేడియంలో 49,000 సామర్థ్యంతో నిర్మించారు. ఇప్పుడు దాని స్థానం లో మొతేరా స్టేడియంను పునర్నిర్మించారు.

** ప్రస్తుతం మైదానం మధ్యలో మొత్తం 11 పిచ్ లు ఉన్నాయి. నలుపు ఎరుపు మట్టితో వికెట్లను అత్యంత అందంగా తీర్చిదిద్దారు. మైదానంలో బెర్ముడా గడ్డ ఆస్ట్రేలియాలో నుంచి తెప్పించి వాడారు.
** పిల్లర్లు లేకుండా మొత్తం ఎంత పెద్ద స్టేడియాన్ని నిర్మించడం మరో విశేషం. స్టేడియంలో ఎంతో పైన ఉన్న వారికి ఎంతో మూలన ఉన్న వారికి సైతం మ్యాచు చాలా చక్కగా కనిపిస్తుంది. ఎలాంటి అడ్డంకులు స్తంభాలు ఉండవు.

** యాభై ఐదు గదులు, ఇండోర్ అవుట్డోర్ క్రీడలు రెస్టారెంట్, ఒలంపిక్ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం, పార్టీ ఏరియా, త్రీడీ ధియోటర్, క్లబ్ హౌస్ ను మైదానంలో నిర్మించారు. క్రికెట్ అకాడమీ ఇండోర్ ప్రాక్టీస్ పిచ్ లు కూడా స్టేడియంలో భాగంగానే ఉన్నాయి.
** స్టేడియంలో అదనంగా రెండు క్రికెట్ మైదానాల్లో 9 ప్రాక్టీస్ పిచ్ లను ఏర్పాటు చేశారు. ఫుట్బాల్ హాకీ బాస్కెట్బాల్ కబడ్డీ బాక్సింగ్ టెన్నిస్ వంటి క్రీడలు నిర్వహించుకునేందుకు వసతులను తగ్గట్టుగా ఏర్పాటు చేశారు.

** దేశంలో ఎల్ఈడి వెలుతురు ఉన్న మొట్టమొదటి స్టేడియం కూడా ఇదే. స్టేడియంలో రాత్రివేళ లైట్ లకు బదులు స్టేడియం పైకప్పు కె ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఆటగాళ్ల నీడ సైతం వారికి అడ్డంకి కలిగించే అవకాశం లేదు.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju