NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Kazipet Rail Coach Factory: రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై తెలంగాణలో కొత్త రాజకీయ కాక..!!

political fight about kazipet rail coach factory

Kazipet Rail Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ Kazipet Rail Coach Factory.. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నెరవేర్చడం తక్కువే. ఇందులో అనేక అంశాలపై ఏపీ ఇంకా గొంతెత్తి పోరాడుతూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ కూడా తమ రాష్ట్రం కోసం గొంతెత్తుతోంది. కాజీపేట రైల్వే కోచ్ కర్మాగారం ఇస్తామని ఆనాడు ప్రకటించి నేటికీ నెరవేర్చలేదు.

సమచార హక్కు చట్టం ద్వారా ఓవ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీకి అనువైన ప్రదేశం కాదనీ.. దేశంలో ఎక్కడా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని తేల్చేసింది. ఇప్పుడు ఈ అంశంలపై తెలంగాణలో రాజకీయ కాక మొదలవుతోంది.

political fight about kazipet rail coach factory
political fight about kazipet rail coach factory

మంత్రి కేటీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడమే ఇందుకు ఉదాహరణ. విభజన హామీలో భాగంగా వరంగల్ జిల్లాలోని ఖాజీపేటకు రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేస్తామని ఆనాడు యూపీఏ హామీ ఇచ్చిందని.. ఇప్పుడు ఎన్డీఏ ఇవ్వకుడా మోసం చేసిందని అన్నారు. ఆ ప్రాజెక్టు అవసరమే లేదని చెప్పడం ఎంతవరకూ సమంజసం అంటూ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టును రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదని.. దీనిపై పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అనుమతి తీసుకుని తమ కార్యాచరణపై ముందుకెళ్తామని అంటున్నారు. ఇక దీనిపై కాంగ్రెస్ కూడా స్పందించింది.

 

తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇన్నాళ్లూ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదని కౌంటర్ చేస్తోంది. కమీషన్లు దక్కే ప్రాజెక్టు కానందువల్లే సీఎం కేసీఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని విస్మరించారంటూ విమర్శించారు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓవైపు రైల్వేను ప్రైవేటీకరణ చేద్దామని బీజేపీ చూస్తూంటే ఇక కోచ్ ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశం ఏముంటుందని అంటున్నారు. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ బీజేపీ నుంచి ఇంకా సమాధానం రాలేదు. సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో.. బీజేపీ ప్రభుత్వంపై ఎలా పోరాడతారో చూడాల్సి ఉంది

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N