NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Sunil Deodhar: జగన్ బెయిల్ ను సునీల్ దియోధరే రద్దు చేయిస్తారా..? బీజేపీ చేస్తోందిదా..?

sunil deodhar comments on cm jagan bail

Sunil Deodhar: సునీల్ దియోధర్ Sunil Deodhar  బీజేపీ నాయకులు తమ దూకుడు పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే వారి ఉద్దేశాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. అందుకు వారు వేస్తున్న అడుగులు వారికే చేటు కలిగించేవిగా ఉన్నాయని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు తొక్కించడం అంటే.. భిన్నమైన ప్రచారం, ఓటర్లను ఆకట్టుకోవడం, తమ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పోరాటం.. ఇలా ముందుకెళ్లాలి. కానీ.. బెదిరింపు రాజకీయాలకు తెరలేవడమే ఇప్పుడు కాస్తంత విడ్డూరంగా ఉంది. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

sunil deodhar comments on cm jagan bail
sunil deodhar comments on cm jagan bail

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అటు నాగార్జున సాగర్, ఇటు తిరుపతిలో ఉప ఎన్నికల హడావిడి జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు ఇద్దరు సీఎంలను టార్గెట్ చేశారు. ఇటివల తిరుపతిలో సునీల్ ధియోధర్ మాట్లాడుతూ.. ‘త్వరలో జగన్ బెయిల్ రద్దవుతుంది’ అని.. ఆమధ్య బండి సంజయ్ కుమార్.. ‘త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్తారు’ అంటూ కామెంట్లు చేశారు. ఇలా వీరిద్దరూ ఇద్దరు సీఎంలపై చేసిన కామెంట్లు ప్రజలను ఆకట్టుకోవడం అటుంచితే సీఎంలకే కలిసొస్తాయని గతంలో నిరుపణైంది. ఇదంతా పక్కనపెడితే అసలు కోర్టు పరిధిలోని అంశాలను బీజేపీ నాయకులు ఎలా ప్రస్తావిస్తారనేది ఇక్కడ ఎవరికైనా వచ్చే సందేహం. ముఖ్యంగా జగన్ విషయంలో సునీల్ ధియోధర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కే లాభం చూకూర్చేలా ఉన్నాయి.

 

గతంలో జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబు ప్రవర్తించిన తీరు జనాల్లోకి వెళ్లబట్టే వైసీపీ భారీ స్థాయిలో విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ముఖ్య నాయకుడే మళ్లీ జగన్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏం జరుగుతుందో ఊహించలేరా? అనేది ప్రశ్న. నిజంగానే రేపు కోర్టు జగన్ బెయిల్ రద్దు చేసినా.. ఇదంతా బీజేపీ చేయిస్తోందా? అని కోర్టులపైనే అనుమానం వచ్చేలా చేసే ఇటువంటి వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేయడం అర్ధరహితం. కోర్టులను ప్రశ్నించడం ఎంత తప్పో.. కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై రాజకీయ నాయకులే వ్యాఖ్యలు చేయడం కూడా అంతే తప్పు. మరి.. బీజేపీ నాయకులు దీనిపై ఎలా అంతర్మధనం చేసుకుంటారో..?

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju