NewsOrbit
న్యూస్

Ramdev Baba: డాక్టర్లను మళ్ళీ కెలికిన రామ్ దేవ్ బాబా..! ఈ సారి స్ట్రాంగ్ డోస్ తప్పదేమో..!

Ramdev Baba: యోగా గురువు బాబా రాందేవ్ ఇంకా రచ్చ ఆపలేదు.అల్లోపతి వైద్యం, ఆ కేటగిరీలోకి వచ్చే వైద్యులపై ఆయన కోపం ఇంకా చల్లారినట్లు కనిపించడంలేదు.మళ్లీ వాళ్లను రాందేవ్ కెలికి వదిలాడు.

Ramdev Baba again fires on doctors
Ramdev Baba again fires on doctors

నిన్నగాక మొన్న !

ఈ మధ్యే బాబా రాందేవ్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో అల్లోపతి వైద్యాన్ని ఆ కేటగిరీ వైద్యులను ఆయన తీవ్రంగా విమర్శించారు.అల్లోపతి వైద్యం వల్లనే కరోనా రోగులు పెద్దసంఖ్యలో చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.రెమడిసీవరు లాంటి ఇంజక్షన్లు సైతం కరోనా రోగుల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి అన్నారు.అల్లోపతి వైద్యం చేసే డాక్టర్ల మీద కూడా నోరు పారేసుకున్నారు. అంతకు ముందొక సందర్భంలో అల్లోపతి డాక్టర్లు ఆధునిక హంతకులని వ్యాఖ్యానించారు.దీంతో ఐఎంఏ తీవ్రంగా స్పందించి ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకొని ప్రాసిక్యూట్ చేయాలంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ను డిమాండ్ చేసింది.మరోవైపు జలంధర్లో ఆయనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.అయితే హర్షవర్ధన్ సకాలంలో జోక్యం చేసుకొని ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా రాందేవ్ ను కోరారు.దీంతో యోగా గురు రామ్దేవ్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.ఇంతటితో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందని అందరూ భావించారు.

Read More: Crime News: ఆ 12 మందికి ఉరి..! ఇదో రియల్ ఖాకీల కఠోర కథ..!!

Ramdev Baba: మళ్లీ పాట మొదలెట్టిన రామ్దేవ్!

ఆదివారం నాడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు బాబా రామ్దేవ్ సోమవారంనాడే అల్లోపతి వైద్యులను ప్రశ్నిస్తూ మరో ట్వీట్ వదిలాడు.ఈసారి వారికి ఆయన ఇరవై అయిదు ప్రశ్నలు వేశాడు. బిపి షుగర్ వ్యాధులను అసలు అల్లోపతి వైద్యం పూర్తిగా నయం చేయగలదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.అలాగే ఆర్థరైటిస్ ,థైరాయిడ్,ఆస్తమా వంటి వ్యాధులను నయం చెయ్యడానికి అసలు మందులు ఉన్నాయా అని ఆయన నిలదీశారు.ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొలెస్ట్రాల్ కి హృదయ సంబంధ వ్యాధులకు మీ దగ్గరున్న చికిత్సా విధానం ఏమిటని రామ్ దేవ్ అడిగారు.చివరకు మలబద్ధక వ్యాధినైనా ఏ మందైనా పూర్తిగా నయం చేస్తుందా అని ఆయన సెటైర్ విసిరారు.ఇలాగే పలు వ్యాధులను ప్రస్తావించిన రాందేవ్ చివరగా వైద్యులపై పంచ్ డైలాగ్ వేసారు.అల్లోపతి వైద్యం అంత శక్తివంతమైనది అయితే… వైద్యులు సర్వగుణ సంపన్నులైతే వారు ఏ జబ్బు బారిన పడబోరన్నారు.అల్లోపతి వైద్యం కేవలం రెండు వందల సంవత్సరాల క్రితమే పుట్టిందని ఆయన గుర్తుచేశారు.కాని వ్యాధుల చరిత్ర వందలాది సంవత్సరాల క్రితందని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై ఐఎంఏ మళ్ళీ ఏమని స్పందిస్తుందో ,ఎక్కడకు దారితీస్తుందో చూడాలి!

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju