NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana PCC: రేవంత్ రెడ్డి..కోమటిరెడ్డి …మధ్యలో జగ్గారెడ్డి!తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి తగ్గని డిమాండ్ !!

Telangana PCC: తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో,2019 లోక్సభ ఎన్నికల్లో,గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ,దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ పీసీసీ అధ్యక్ష పదవిపై చాలామందికి మోజు ఉంది.ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి చాలా రోజులైంది.

demand for the post of telangana pcc chief is not low
demand for the post of telangana pcc chief is not low

దాన్ని భర్తీ చేసే ప్రక్రియను కాంగ్రెస్ చేపట్టింది.ఇక నాగార్జుసాగర్ ఉపఎన్నిక రావడంతో సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తి మేరకు ఆ ప్రక్రియను కొద్దికాలం వాయిదా వేశారు.ఒకవేళ ఆ ఉపఎన్నికలో జానారెడ్డి గెలిచి ఉంటే ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా అధ్యక్షుడయ్యేవారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.కాని ఓడిపోవడంతో జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు.దీంతో మళ్లీ పీసీసీ చీఫ్ పదవి పై లాబీయింగ్ మొదలైంది.

రేసులో ముందు వరుసలో ఆ ఇద్దరు!

కాగా తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఎంపీలు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు.ఇద్దరూ కూడా ఎంపీలే.నిజానికి వెంకట్రెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్.రేవంత్ రెడ్డి టిడిపి నుండి వచ్చి కాంగ్రెస్ లో చాలా స్వల్పకాలంలో పైకెదిగారు.పైగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్రెడ్డి అయితేనే పీసీసీ చీఫ్ గా సీఎం కెసిఆర్ ని ఎదుర్కోగలరన్న అభిప్రాయం రాహుల్ కి ఉందని ,అందువల్ల రేవంత్ రెడ్డి మెడలో వరమాల పడగలదని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్న తరుణంలో మరో సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రంగంలోకి వచ్చారు.

Read More: Harish Rao: పుట్టిన‌రోజున హ‌రీశ్ రావు సంచ‌ల‌న నిర్ణ‌యం… వైర‌ల్ అవుతున్న ప్ర‌క‌ట‌న‌

నేనూ రేసులోనే ఉన్నానన్న జగ్గారెడ్డి

తాను కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు జగ్గారెడ్డి బుధవారం బహిరంగంగా ప్రకటించారు.తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయన్నారు.” ప్రజల కష్టాలు తీర్చే మెడిసిన్ నా వద్ద ఉంది. ఆనందయ్య లాంటి మందు అందుబాటులో ఉంది. సోనియా పీసీసీ పదవిని ఎవరికి ఇచ్చినా నాకు సమ్మతమే.నాకు ఇస్తే మరీ బాగుంటుందని జగ్గారెడ్డి తన మనసులో మాట చెప్పారు.ఇంకా ఈ పదవిపై ఆశ ఉన్న కాంగ్రెస్ నేతలు వారెందరో ఉన్నారు.ఒక్కొక్కరుగా బయటకు వస్తారేమో చూడాలి.

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju