NewsOrbit
న్యూస్

Bharatha Sindhuri: తెలుగు మహిళా ఐఏఎస్ కు అరుదైన గౌరవం!”భారత సింధూరి” పేరిట బయోపిక్ !!

Bharatha Sindhuri: ఇప్పటివరకు క్రీడాకారులు,సినీ నటులు,రాజకీయ నాయకుల వంటివారిపైనే బయోపిక్ లువచ్చాయి.తొలిసారిగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద కూడా బయోపిక్ రూపుదిద్దుకోనుంది.ఆ మహిళా ఐఏఎస్ అధికారి తెలుగమ్మాయి కావడం ఇక్కడ విశేషం.వివరాల్లోకి వెళితే … కర్నాటకలో ఐఏఎస్ అధికారిగా ఉన్న తెలుగమ్మాయి రోహిణి సింధూరి పేరిట బయోపిక్ రానున్నది.ఇప్పటికే కర్నాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో “భారత సింధూరి” అనే టైటిల్ ను కృష్ణ స్వర్ణసండ్ర అనే దర్శకుడు రిజిస్టర్ కూడా చేసేశారు.రోహిణి సింధూరి బయోపిక్ కోసమే ఈ టైటిల్ ను రిజిష్టర్ చేసినట్లు ఆయన ప్రకటించారు.

Rare tribute to Telugu women IAS! Biopic titled "Bharata Sindhuri" !!
Rare tribute to Telugu women IAS! Biopic titled “Bharata Sindhuri” !!

ఏమిటీ రోహిణి సింధూరి ప్రత్యేకత?

దేశంలో అనేక మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కాని రోహిణి సింధూరి మీదనే బయోపిక్ ఎందుకు తీస్తున్నారంటే ఆమె గురించి తప్పక చెప్పుకుని తీరాలి. మన తెలుగమ్మాయి రోహిణి సింధూరి మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు.విధి నిర్వహణలో మహా కచ్చితంగా ఉంటారని మంత్రుల్నే లెక్కచేయరని రోహిణి సింధూరికి ఇమేజ్ ఉంది.హాసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా వుండగా ఆమెకి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంజుకు మధ్య వార్ జరిగింది.ఆ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను రోహిణి సింధూరి ఉక్కుపాదంతో అణిచేయడ౦ రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా తయారైంది.రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్న రోహిణికి చెప్పేందుకు కూడా ఎవరూ సాహసించని పరిస్థితుల్లో మంత్రి మంజు నాయకత్వంలో పలువురు రాజకీయ ప్రముఖులు అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మొరపెట్టుకొని ఆమెను హసన్ నుండి ట్రాన్సఫర్ చేయించారు.అయితే మొండి ఘటం అయిన రోహిణి సింధూరి హైకోర్టు, ఏపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వెళ్లి హసన్ లోనే కొనసాగే విధంగా ఆర్డర్లు తెచ్చుకుంది.తదుపరి పరిణామాల్లో ఆమె మైసూరుకు బదిలీ అయ్యారు.

సింధూరిని చుట్టుముట్టిన తాజా వివాదం!

అయితే తాజాగా రోహిణి సింధూరి ఒక వివాదంలో చిక్కుకున్నారు.మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ గా ఉన్న రోహిణి సింధూరి తనను వేధిస్తున్నారంటూ మైసూర్ కార్పోరేషన్ కమిషనర్ శిల్పానాగ్ తన పోస్టుకు రాజీనామా చేసే వరకు వెళ్లారు.ఈ నేపధ్యంలో ఆ ఇద్దరు మహిళా ఐఏఎస్ లను కర్నాటక ప్రభుత్వం బదిలీ చేసింది.దేవాదాయ శాఖ కమిషనర్ గా రోహిణి సింధూరి నియమితులయ్యారు.అయితే ఆమె బదిలీకి ప్రజల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.బ్రింగ్ బ్యాక్ రోహిణి పేరుతో ఆన్లైన్ ఉద్యమం ఊపందుకోగా ఇప్పటికీ లక్ష మంది వరకు సంతకాలు చేశారు.మొత్తంగా చూస్తే రోహిణి సింధూరికి ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది.నిబద్ధత గల నిక్కచ్చి అధికారిగా ఆమెకు పేరుంది.

దర్శకుడు ఏం చెబుతున్నాడంటే!

రోహిణి సింధూరి ఉద్యోగ పర్వంలో అన్ని పార్శ్వాలను ఈ బయోపిక్ లో తాను చూప నున్నట్లు దర్శకుడు కృష్ణ తెలిపారు. ఆమె రియల్ జీవితంలో ఒక హీరోయిన్ వంటివారేనని పేర్కొన్నారు. తాజా మైసూరు వివాదాన్ని కూడా ఈ చిత్రంలో జోడిస్తామని కృష్ణ వెల్లడించారు.త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తి చేసి,కరోనా తీవ్రత తగ్గాక షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

 

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju