NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ummareddy Venkateswarlu: ఉమ్మారెడ్డికి ఆ ఉన్నత పదవి వరించనున్నదా..??

Ummareddy Venkateswarlu: వైసీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ పదవి నుండి రిటైర్ అయ్యారు. వాస్తవానికి సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డికి మరో సారి జగన్ ఎక్స్ టెన్షన్ ఇస్తారని అందరూ భావించారు. అయితే వైసీపీలో అనేక మందికి నేతలకు జగన్ గతంలో ఎమ్మెల్సీ హామీలను ఇచ్చి ఉన్నారు. దీంతో ఆ హామీలలో ఒక్కరొక్కరికి అవకాశం కల్పించడం కోసం ఉమ్మారెడ్డి స్థానంలో కాపు కోటా కింద తోట త్రిమూర్తులుకు అవకాశం కల్పించారు వైఎస్ జగన్.

Ummareddy Venkateswarlu likely to get key post
Ummareddy Venkateswarlu likely to get key post

Read More: Gang Rape in Guntur: యువకుడిని కట్టేసి.. యువతిపై దారుణానికి ఒడిగట్టి.. గుంటూరులో బ్లేడ్ బ్యాచ్ దారుణ కాండ..!

అయితే ఉమ్మారెడ్డికి ఎక్స్ టెన్షన్ ఇవ్వకపోవడానికి వేరే కారణం ఉందని అంటున్నారు. వైఎస్ జగన్ మనసులో ఉమ్మారెడ్డికి మరో కీలక పదవి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారని అందుకే ఎమ్మెల్సీగా మరో సారి అవకాశం ఇవ్వలేదన్న మాట వినబడుతోంది. త్వరలో మరో ఉన్నత పదవి ఆయనను వరించనున్నదని ప్రచారం జరుగుతోంది. ఆయనను త్వరలో పెద్దల సభకు పంపనున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డి కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఉమ్మారెడ్డి తొలుత తెలుగుదేశం, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పని చేసి తన సత్తా చాటుకున్నారు. పార్లమెంట్ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

వైసీపీలో చేరిన తరువాత కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహిత నేతలలో ఒకరిగా ఉన్నారు. 2014,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీల్లో ఉమ్మారెడ్డి కీలక భూమికను పోషించారు. జగన్ పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విధానాల కమిటీలోనూ ఉమ్మారెడ్డి ముఖ్య నేతగా పని చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మారెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అని చాలా మంది అనుకున్నారు కానీ ఆ అవకాశం దక్కలేదు. కానీ మండలిలో ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి సమర్థవంతంగా బాధ్యతను నిర్వహించారు.

వివాద రహితుడుగా, మేథావిగా పేరున్న ఉమ్మారెడ్డిని రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ ఉండటం వల్ల ఎమ్మెల్సీగా మరో సారి ఎక్స్ టెన్షన్ ఇవ్వలేదనీ, మంత్రివర్గంలోకి తీసుకోలేదని అనుకుంటున్నారు. సామాజిక వర్గ పరంగా చూసుకున్నా ఇప్పటి వరకూ వైసీపీ నుండి రాజ్యసభలో ఎక్కువ మంది రెడ్డి వర్గం నేతలే ఉన్నారు. ఇటీవలే ఇద్దరు బీసీ నేతలను పంపించారు. తరువాత వచ్చే రాజ్యసభ స్థానాన్ని కాపు కోటాలో ఉమ్మారెడ్డిని పంపితే సామాజిక పరంగా న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరో పక్క టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపి  మేకపాటి రాజమోహన్ రెడ్డి సైతం రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దల సభకు వైఎస్ జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారో చూడాలి మరి.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju