Weight: చక్కెరలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే కారణంగా దీనిని ఎక్కువగా తింటే లేనిపోని రోగాలు వస్తాయి . అందుకే చాలా మంది షుగర్ కు బదులుగా తేనెను తీసుకుంటారు.సకల ఔషధ గుణాలతో ఉన్న తేనె.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్,గుండె, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
చాలా మంది బరువు తగ్గడం కోసం ఏ పద్ధతిలో నైనా తేనె ఉండేలా చూసుకుంటారు. మాములు వేడి నీటిలో తేనె కలుపుకుని తాగి నా కూడా ఫలితం కనబడుతుంది అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.ఇక బెల్లం లో ఇనుము ఎక్కువ మోతాదులో ఉంటుంది. బెల్లం తరుచూ తింటే రక్తం రక్త శాతం పెరుగుతుంది. పోషకాల విలువలు అధికంగా ఉన్న బెల్లాన్ని ఇంటిలో ఎప్పుడు నిల్వ ఉండేలా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కలుగుతాయి.బెల్లం తో జలుబు, దగ్గు, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. బెల్లం తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది ఎర్ర రక్తకణాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం లేదా రాత్రి ఆహారంలో ఒక బెల్లం ముక్క కలిపి తింటే మంచిది అని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు.శరీర నొప్పులు తగ్గించడం బెల్లం బాగా పనిచేస్తుంది. బెల్లం, నల్ల నువ్వులు తో చేసిన లడ్డూలు తింటే చలికాలంలో ఉబ్బసం సమస్య ఉండదు. అంతేగాక ఆడవారి నెలసరి సమస్యలను నివారించడానికి కూడా ఇది మంచి పరిష్కారం. బెల్లం, తేనె రెండు చక్కెరకు బదులుగా వాడేవే. అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ ?బరువు తగ్గడానికి సంబంధించిన ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే చెప్పడం కొంచెం కొంచెం కష్టమే . కానీ ప్ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న తేనె, బెల్లం తో ఉపయోగాలు సంగతి ఎలా ఉన్న కొత్త ప్రమాదాలు వస్తున్నాయి.
మిగతా విషయాలు ఎలా ఉన్న బరువు తగ్గే విషయంలో మాత్రం తేనెతో పోలిస్తే బెల్లమే మంచిది అని తెలుపుతున్నాయి అధ్యయనాలు. మార్కెట్లో ప్రాసెస్ చేయని స్వచ్ఛమైన తేనె ఉంటే మాత్రం దానిని తీసుకోవడం మంచిది . ఎందుకంటే.. ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న తేనె అసలైన తేనె కాదని,అది ఉట్టి చక్కెర ద్రావణం అని బయటపడింది. ఈ రకంగా చూసుకుంటే మాత్రం తేనె కంటే బెల్లం తీసుకోవడం మంచిది.