NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: రేవంత్ కీలక నిర్ణయాలు..! నేతలకు బాధ్యతలు అప్పగింత..!!

Huzurabad By Poll: హూజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియమితులైన తరవాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక కావడంతో హుజూరాబాద్ ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటి వరకూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి గా ఉన్న కౌశిక్ రెడ్డి రాజీనామా, బహిష్కరణ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపి  టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలన్న కృత నిశ్చయంతో పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో భాగంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, బలమైన అభ్యర్థి ఎంపికకు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

Huzurabad By Poll congress appoints mandals municipalities in charges
Huzurabad By Poll congress appoints mandals municipalities in charges

Read More: BJP MP GVL: సీఎం జగన్‌తో పాటు బాబును జీవిఎల్ ఇరికించేశాడుగా..! దటీజ్ జీవిఎల్..!!

హుజూరాబాద్ నియోజకవర్గ పీసీసీ ఇన్ చార్జిగా దామోదర రాజనర్శింహకు బాధ్యతలను అప్పగించింది పీసీసీ. అదే విధంగా ఉప ఎన్నికల కోఆర్డినేటర్ లుగా జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు కొనసాగుతారని పీసీసీ  ప్రకటించింది. మండలాలు, మున్సిపాలిటీల వారిగా పార్టీ బలోపేతానికి ఇన్ చార్జిలను పార్టీ నియమించింది. వీణవంకక ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్, జమ్మికుంటకు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కిన్ సింగ్, జమ్మికుంట మున్సిపాలిటీకి సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య, హుజూరాబాద్ కు తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హుజూరాబాద్ మున్సిపాలిటీకి బొమ్మ శ్రీరం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు, ఇల్లందకుంటకు నాయని రాజేందర్ రెడ్డి, కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్ కు కొండ సురేఖ, దొమ్మాటి సాంబయ్యలను ఇన్ చార్జిలుగా నియమించారు.

ఇప్పటికే బీజేపీ పక్షాన ఈటల రాజేందర్ పోటీ చేయడం కన్ఫర్మ్ కాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు అవుతారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జీజెఎస్ అభ్యర్థి కూడా రంగంలో ఉంటారని ఇప్పటికే ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండ రామ్ ప్రకటించారు. మరో పక్క నియోజకవర్గంలో పార్టీ నేతలు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju