NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Chief Ministers: ఇది సీఎం ల మార్పిడి సీజనా?వరుసబెట్టి మారిపోతున్నారు!!

Chief Ministers: ఎండాకాలం, వానాకాలం ,శీతా కాలమని ఇలా దేశంలో అనేక సీజన్లు ఉంటాయి.ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రుల మార్పిడి సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ నెలలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పిడి జరిగింది.ఇక మూడు నాలుగు రోజుల్లో కర్నాటక ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా పదవీ గండం ఉంది.పంజాబ్ లోనూ అదే పరిస్థితి నెలకొంది.

Is this the CM's exchange season?
Is this the CM’s exchange season?

అసలేం జరుగుతోంది?

ఈ దేశంలో బిజెపి ,కాంగ్రెస్ లు రెండే ప్రధాన రాజకీయ పార్టీలు.మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉండగా కొద్ది రాష్ట్రాలు కాంగ్రెసుకు మిగిలాయి.ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా ఆయా పార్టీలు సీఎంలను మార్చుతూ వెళుతున్నాయి.ఒకప్పుడు తరచూ ముఖ్యమంత్రులను మారుస్తుందన్న అపప్రథ కాంగ్రెస్ కి ఉండేది.ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్.1978-83 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి,అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లు ముఖ్యమంత్రులు అయ్యారు.1989-94 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిష్టించారు.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత శక్తివంతమైన నాయకుడు కాబట్టి 2004నుండి 2009 లో మరణించే వరకు వరకు ఆయనే సీఎంగా కొనసాగారు.కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారని టెర్మ్ ఏదైనా ఉంటే అది ఇదే.వైఎస్సార్ మరణానంతరం కొద్దిరోజులు కొణిజేటి రోశయ్య,ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పాలించారు.ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. అది వేరే విషయం.విచిత్రం ఏమిటంటే ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ సంస్కృతిని అవలంబిస్తోంది.

వరుసపెట్టి బిజెపి సీఎంల మార్పులు!

భారతీయ జనతాపార్టీ ఇటీవలే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ను తొలగించి పుష్కర్ సింగ్ దామీ కి పట్టంగట్టింది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈనెల ఇరవై ఆరో తేదీన తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.వృద్ధాప్యం కారణంగా పార్టీ నియమావళి ప్రకారం తాను ముఖ్యమంత్రిగా తప్పుకుంటున్నానని యడ్యూరప్ప చెప్పినప్పటికీ,బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన కుర్చీ దిగుతున్నారని సమాచారం.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మెడపై కూడా కత్తి వేలాడుతోంది.త్వరలోనే ఆయనకు పదవీచ్యుతి తప్పదంటున్నారు.ఇక కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇవాళ రేపు ఇంటికెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారని టాక్.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju