partner: నిజాయితీగా ఉండటం అనేది చాలా మంచి విషయం. అయితే కొన్ని మారని విషయాలు ఉంటాయి.. ఉదాహరణకు ముక్కు వంకర, పొట్టిగా ఉండడం, కళ్ళు ఇంకా పెద్దగా ఉంటే బాగుండు ఇలాంటివి మారవు కాబట్టి అలాంటి విషయాలు వదిలేసి..వ్యక్తిత్వం తీర్చిదిద్దుకునే వాటిమీద నిజయీతి గా ఉంటే సరిపోతుంది. ఆ నిజాయితీ మీ బంధాన్ని నిలబెట్టుకొనే విషయంలో ఉంటే చాలు. కానీ ప్రతి చిన్న లేదా పెద్ద విషయంలో అయినా మీ భాగస్వామిని ఇతరులతో పోల్చి నీకంటే తన బెటర్ అని అనడం మాత్రం మీ బంధానికి ఎంతమాత్రం మంచిది కాదు.
ఎందుకంటే ఎవరి టాలెంట్ వారిది.. ఎవరి స్టైల్ వారిది . కాబట్టి ఇతరులు ఎలా ఉంటున్నారనేది మీ బాయ్ ఫ్రెండ్‌కు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దానితో పాటు ఇతరులను అనుసరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతడే ఇతరులతో మిమ్మల్ని కంపేర్ చేసి,తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే మీకెంత బాధగా ఉంటుందో అతనికి కూడా అలాగే అనిపిస్తుంది. కాబట్టి వీలైతే అతని వ్యక్తిత్వం లో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దే విధం గా మాట్లాడండి. తప్ప వాటి గురించి అదే పనిగా అతన్ని అవమానించే ప్రయత్నం మానుకోవడం ఉత్తమం.ఒక వ్యక్తి అందరికి నచ్చే వలసిన అవసరం ఏమి లేదు.. ఏదో ఒక కారణం వల్ల మీ భాగస్వామి మీ కుటుంబ సభ్యులకు , మీ ఫ్రెండ్స్ కి నచ్చకపోవచ్చు. ఆ విషయాన్ని మీ భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. ఎందుకంటే అతనికి ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారు అనేది అతను అంతగా పట్టించుకోరు..మీరు ఏమనుకుంటున్నారు అతన్ని ప్రేమిస్తున్నారా? లేదా? అనేది మాత్రమే అతను పట్టించుకుంటారు .
ఇదే విషయం మీకు కూడా వర్తిస్తుంది. ఇతరులు ఏమనుకుంటున్నారనే దాని కంటే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? లేదా అనేది మీకూ ముఖ్యం . అందుకే ఇలాంటి విషయాలు మాట్లాడుకుని మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచుకోవడం కంటే.. ఇద్దరూ కలసి ఆ సమస్యను పరిష్కరించ గలరేమో ఆలోచించుకోవడం మంచి పద్ధతి.