NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijaya Sai Reddy: విజయసాయికి ఒకే రోజు ఒక గుడ్, మరొక బ్యాడ్ న్యూస్‌..! అవి ఏమిటంటే..?

Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒకే రోజు ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ అందాయి. విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ కేసులు తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు ఆదేశించడాన్ని  విజయసాయి హైకోర్టులో సవాల్ చేశారు. మొదట సీబీఐ కేసులు విచారణ జరపాలని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు రెండింటిని సమాంతరంగా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని విజయసాయి హైకోర్టును కోరారు. అయితే విజయసాయి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈడీ కేసులే తొలుత విచారించాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఇది విజయసాయికి బ్యాడ్ న్యూస్ కాగా, మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే..

Vijaya Sai Reddy elected as pac member
Vijaya Sai Reddy elected as pac member

పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఎన్నికయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా ఎన్నికైయ్యారు.  ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ వర్మ  ఒక బులెటెన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుండి గతంలో పీఏసీ సభ్యులుగా ఉన్న భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు నామినేషన్లు ఆహ్వానించగా విజయసాయితో పాటు బీజేపీ సభ్యుడు డాక్టర్ సుధాంశు త్రివేది మాత్రమే నామినేషన్ లు దాఖలు చేశారు. దీంతో వీరు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఇది విజయసాయికి గుడ్ న్యూస్.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N