Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే బ్లాస్టర్ అంటూ సర్కారు వారి పాట సినిమా నుంచి అద్భుతమైన టీజర్‌ను వదిలింది చిత్ర బృందం. ఈ టీజర్ సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. మహేష్ ఇంట్రో డైలాగ్..సార్ కి రోజూ దిష్టి తీయండి అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ చెప్పిన డైలాగ్, చివరిలో ఏవయ్యా కిషోర్ ఓ 5-6 మూరలుండవ అవి… అంటూ కీర్తి పెట్టుకున్న మల్లెపూలను చూస్తూ కామెంట్ చేసే డైలాగ్..ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. యాక్షన్, రొమాన్స్ రెండు కలిపి వదిలిన సర్కారు వారి పాట బర్త్ డే బ్లాస్టర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
గత ఏడాది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ బాబును రివీల్ చేయకపోవడంతో చిత్ర బృందం కొత్త ట్రోల్‌కి గురైంది. టైటిల్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన మేకర్స్ మహేష్ లుక్ ని మాత్రం రివీల్ చేయలేదు. దాంతో అభిమానుల ఒత్తిడి బాగా ఎక్కువైంది. దాంతో బ్లాస్టర్‌తో భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. దాంతో సర్కారు వారి పాట సినిమా మీద అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను మేకర్స్ ఖచ్చితంగా అందుకునే ప్రయత్నాలే చేస్తున్నారు. 2022, జనవరి 13న సర్కారు వారి పాట రిలీజ్ కాబోతోంది.
Mahesh : మహేష్ ఫ్యాన్స్ ..ఫీలవుతూ ట్వీట్ చేస్తున్నారు.
అయితే మహేష్ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా ( ట్విట్టర్ ) ద్వారా తెలియచేశారు. మెగాస్టార్ చిరంజీవి, ఐటీ శాఖామంత్రి కె.టి.ఆర్ సహా ఇండస్ట్రీలోని వారందరూ విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే సర్కారు వారి పాటలో హీరోయిన్గా నటిస్తున్న కీర్తి సురేశ్ కూడా మహేశ్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపింది. దీనికి మహేష్ రీ ట్వీట్ చేస్తూ ఇందులో కీర్తి పోషిస్తున్న పాత్ర పేరును పొరపాటున రివిల్ చేస్తూ రిప్లై ఇచ్చాడు. ఇందులో కీర్తి పేరు ‘కళావతి’ అని మహేష్ చేసిన ట్వీట్ ద్వారా అర్థమైంది. దాంతో మహేష్ ఫ్యాన్స్ ..ఎంతపని చేశావ్ అన్నా.అని ఫీలవుతూ ట్వీట్ చేస్తున్నారు.
You are not only an inspiration on screen but off screen as well!❤️
Here’s to an amazing co-star and a beautiful person. May you have a day as fabulous as you! Happy Birthday, @urstrulyMahesh sir!?? #SarkaruVaariPaata Teaser – https://t.co/vrmvtgw4Oq#HBDSuperstarMaheshBabu
— Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2021
Thank you, 'Kalavathi' ?
— Mahesh Babu (@urstrulyMahesh) August 9, 2021