NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy Vs Malla reddy: టీపీసీసీ పదవికి రేవంత్ రాజీనామా..? మంత్రి మల్లారెడ్డి సవాల్..!!

Revanth Reddy Vs Malla reddy: తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటలు తూటాలుగా పేలుతున్నాయి. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసిఆర్ సర్కార్ పై చేస్తున్న ఘాటు విమర్శలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల కోసం భూములను మంత్రి కబ్జా చేశారనీ, నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి అసైన్డ్ భూములు కాజేశారంటూ రేవంత్ రెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి అల్లుడు చెరువునే మింగేశాడనీ, మంత్రి కుటుంబ సభ్యుల అవినీతిపై గ్రామాల్లో దండోరా వేయిస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

minister Malla reddy serious comments on Revanth Reddy
minister Malla reddy serious comments on Revanth Reddy

రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. పీసీసీ పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేసి రా..మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి వస్తా..ఎవరు హీరోనో ఎవరు జీరోనో తేల్చుకుందాం అంటూ మల్లారెడ్డి తొడగొట్టి మరీ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అందరికీ టైమ్ ఇవ్వడం కాదు. వెళ్లి రాజీనామా చేసి రా..ఇద్దరం పోటీ పడి తేల్చుకుందాం అంటూ మల్లారెడ్డి రేవంత్ కు సవాల్ చేశారు. మల్లారెడ్డి హై పిచ్ కి వెళ్లి అరేయ్ సాలే రేవంత్, అరే గూట్లే అంటూ తిట్ల దండకం అందుకున్నారు. బ్లాక్ మెయిల్ చేయడంలో, బట్టే బాజ్ లో నెంబర్ ఒన్ అయిన రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నానంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు మల్లారెడ్డి.

ఒక నాడు తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక నేతలుగా పని చేసిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కత్తులు దూసుకునేలా తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి మల్లారెడ్డి సవాల్ పై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju