NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP Vs YCP: అమిత్ షా వద్ద ఏపి పంచాయతీ…! సుజనా చౌదరి కలయికపై విజయసాయి విసుర్లు..!!

TDP Vs YCP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద ఏపిలో పరిణామాలపై టీడీపీ, వైసీపీ ఎంపిలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు చేశారు. హోంశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి హజరు అయిన హోంశాఖ మంత్రి అమిత్ షా తో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తదితర ఎంపిలు వేరువేరుగా కలిసి మాట్లాడారు. ఏపిలో పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. టీడీపీ, చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయగా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ తీరు. టీడీపీ కార్యాలయంపై దాడి తదితర విషయాలను, చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన విషయాలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల వివరించారు. ఇదే సందర్భంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా అమిత్ షాతో మాట్లాడారు. దీన్ని పురస్కరించుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ అమిత్ షాను సుజనా చౌదరి ప్రాధేయపడ్డారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చూస్తుంటే సుజనా చౌదరి ఇంకా పసుపు రంగును వదల్లేదనీ, కాషాయాన్ని ఇంకా వంటబట్టించుకోలేదని తెలుస్తోందన్నారు. సుజనా నేటికీ తన రియల్ బాస్ కోసమే పని చేస్తున్నట్లు నిరూపితమైందని విజయసాయి ట్వీట్ చేస్తూ అమిత్ షా పక్కనే సుజనా చౌదరి నడుస్తున్న ఫోటోను షేర్ చేశారు.

TDP Vs YCP complaint to amit shah
TDP Vs YCP complaint to amit shah

 

TDP Vs YCP: అమిత్ షాను కలిసిన గోరంట్ల మాధవ్, కనకమేడల

టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల..అమిత్ షాకు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంలో చంద్రబాబుకు త్వరలో అపాయింట్ మెంట్ ఇస్తానని కనకమేడలకు హామీ ఇచ్చారని సమాచారం. ఏపి పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. కాగా హిందూపూర్ వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫిర్యాదు అందజేశారు. సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ కార్యాలయంపై దాడికి గల కారణాలు, రాష్ట్రంలో టీడీపీ వ్యవహరిస్తున్న వైఖరిపై అమిత్ షాకు పలు అధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలన చేస్తానని తనకు అమిత్ షా హామీ ఇచ్చినట్లు మాదవ్ తెలియజేశారు.

 

వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం

ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు పట్టాభి ఇంటిపై, టీడీపి కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారు. దీనికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేయడంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు. పీఎం మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు లభించకపోవడంతో వారిని కలవకుండానే చంద్రబాబు తిరుగు ప్రయాణం అయ్యారు. పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N