NewsOrbit
రాజ‌కీయాలు

ఆంధ్రకు అన్ని ఇచ్చాం: మోది

కర్నూలు, మార్చి 29: ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) కట్టుబడి పని చేసిందని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబే లక్ష్యంగా ప్రధాని మోది విమర్శలు గుప్పించారు.

రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితే బాబు  యుటర్న్ తీసుకున్నారని మోది విమర్శించారు. దేశాన్ని నష్టపర్చాలనుకుంటున్న వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి కాకుండా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని మోది విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అవినీతి మయం అయ్యాయని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేసింది,  విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణకు పెద్ద ఎత్తున నిధులు, కడప, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణకు చర్యలు తీసుకుంది ఈ చౌకీదార్ కాదా అని ప్రశ్నించారు.

అదే విధంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐఐఎం, ఐఐటి, ఎయిమ్స్ తదితర సంస్థలు మంజూరు చేసింది ఎవరు అని మోది ప్రశ్నించారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల లక్షలాది మంది లబ్దిపొందారని మోది పేర్కొన్నారు. ఇక్కడ పాలకుల దుర్నీతి కారణంగానే ప్రజలు ఇంకా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మోది అన్నారు. రాష్ట్రానికి ఇంకా చేయాలని తనకు ఉన్నాగానీ ఇక్కడి యుటర్న్ బాబు స్వార్థ రాజకీయం కోసం సహకరించలేదని మోది విమర్శించారు.

రాయలసీమకు ద్రోహం చేస్తున్న వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మోది పిలుపు ఇచ్చారు.  రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమ అంటూ కర్నూలుకు ప్రధాని రావడం అదృష్టంగా భావిస్తున్నానని మోది తొలుత పేర్కొన్నారు. సభలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాజ్యసభ సభ్యులు, ఎంపిలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

Leave a Comment