Bigg Boss: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ వేవ్ ఇంకా ఉండగానే ఆరో సీజన్ ప్రారంభం కానున్నట్లు షో నిర్వాహకులు అధికారికంగా తెలపటం సంచలనంగా మారింది. సాధారణంగా తొమ్మిది నెలలు అయిన తర్వాత గ్యాప్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అంత గ్యాప్ తీసుకోకుండానే ఆరో సీజన్ స్టార్ట్ చేయడానికి షో నిర్వాహకులు రెడీ అయ్యారు. అంతమాత్రమే కాకుండా 24 గంటలు హౌస్ లో ఏం జరుగుతుంది అనేది చూపించాలని కూడా.. ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి బిగ్ బాస్(Bigg Boss) షో ప్రతి ఎపిసోడ్ ఒక గంట మాత్రమే ఉంటుంది. కానీ ఆరో సీజన్ ఈ విషయంలో గతానికి భిన్నంగా.. 24 గంటలు హౌస్ లో ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు తెలియజేయాలని చూపించాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే ఆడిషన్స్ మొదలైనట్లు త్వరలోనే సీజన్ సిక్స్ కి సంబంధించి… కంటెస్టెంట్ ల వివరాలు తెలియజేయనున్నారు అట. ఇదిలా ఉంటే సీజన్ సిక్స్ కి కూడా హోస్ట్ నాగార్జున(Nagarjuna) అంట. నిన్న డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ నిర్వాహకులు.. మరియు నాగార్జున మీడియా సమావేశం పెట్టి సీజన్ సిక్స్ గురించి అనేక విషయాలు తెలియ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున నెక్స్ట్ సీజన్ కి కూడా హోస్ట్ గా తానే చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ కి..హోస్ట్ గా పలువురు సీనియర్ హీరోల పేర్లు ముఖ్యంగా బాలకృష్ణ(Balakrishna) పేరు గట్టిగా కనబడింది కానీ నాగార్జున.. కానీ హోస్టింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
దీంతో వరుసగా నాలుగో సారి తెలుగు బిగ్బాస్ సీజన్ కి నాగార్జున యాంకరింగ్ చేస్తున్నట్లు పరిస్థితి మారింది. కేవలం వీకెండ్ ఎపిసోడ్ లో మాత్రమే ప్రత్యక్షమయ్యే నాగార్జున ఇంటి సభ్యులను డిల్ చేసే విధానం చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటది. మంచి చేస్తే పొగడటం చెడు చేస్తే సరిదిద్దటం.. మాత్రమే కాక ఎంటర్టైన్ ఇంటిలో సభ్యులు అయ్యే రీతిలో చూస్తున్న ప్రేక్షకులు కూడా అయ్యేవిధంగా నాగార్జున డీలింగ్ ఉంటది. ఈ నేపథ్యంలో ఆ రోజు సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా.. ప్రకటించడం బిగ్ బాస్ ఆడియన్స్కి ఆనందాన్ని కలిగిస్తోంది.