NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Russia – Ukraine War: బెలారస్ లో శాంతి చర్చలకు నో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ…ఎందుకంటే…

Russia – Ukraine War: యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాతో బెలారస్ లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు. నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ కు భారీ నష్టం జరుగుతుండగా, ఉక్రెయిన్ ఎదురుదాడితో రష్యాకు కొంత మేర నష్టం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు యుద్ధాన్ని నిలిపివేసి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో రష్యా చర్చలకు అంగీకరించింది. బలారస్ దేశంలోని గోమెల్ నగరంలో ఏర్పాటు చేస్తున్న చర్చలకు రావాలని ఉక్రెయిన్ కు రష్యా వర్తమానం పంపింది.

Russia - Ukraine War: Ukraine says no to peace talks in Belarus
Russia – Ukraine War: Ukraine says no to peace talks in Belarus

Read More: Ukraine crisis: 24 గంటల్లో 709మంది.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్న విద్యార్థులు

Russia – Ukraine War: ఈ దేశాలలో చర్చలకైతే ఉక్రెయిన్ సిద్ధం

రష్యా పంపిన ప్రతినిధి బృందం గోమెల్ నగరానికి చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రాకకోసం ఎదురుచూస్తోంది. అయితే బెలారస్ లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు. తమ దేశంపై రష్యా చేస్తున్న దాడుల్లో కొన్ని బెలారస్ గడ్డ పై నుండి జరుగుతున్నాయనీ జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ పై దూకుడు స్వభావం ప్రదర్శించని ప్రాంతంలో మాత్రమే చర్చలు జరపడానికి వస్తామని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై క్షిపణులు ప్రయోగానికి వేదికలు కాని దేశాల్లో చర్చలు జరిపేందుకు సిద్ధమని జెలెన్ స్కీ చెప్పారు. వార్సా, ఇస్తాంబుల్, బకులలో శాంతి చర్చల వేదికను ఏర్పాటు చేయవచ్చని సూచించారు.

రష్యా  క్రూయిస్ మిసైల్ ను ఉక్రయిన్ వాయుసేన కూల్చేసింది

రష్యా దళాలు అత్యంత కిరాతకంగా వ్యవహరించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కురిపిస్తున్నాయన్నారు. మిలటరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేని, ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా దాడులు చేశాయని చెప్పారు. అంబులెన్స్ తో సహా ప్రతి దానిపైనా దురాక్రమదారులు దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. కాగా బెలారస్ నుండి కీవ్ నగరంపైకి ప్రయోగించిన క్రూయిస్ మిసైల్ ను ఉక్రయిన్ వాయుసేన కూల్చేసిందని ఆ దేశ ఆర్మ్ డ్ ఫోర్సెస్ కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జలుజ్నీ పేస్ బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు. బెలారస్, రష్యా మరొక యుద్ద నేరానికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N