NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీలో రెండో రోజూ టీడీపీ నిరసనలు

AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులు రెండవ రోజూ తమ ఆందోళన కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలంటూ టీడీపీ పట్టుబట్టింది. కల్తీ సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలంటూ ఆందోళన చేస్తున్నారు. నకిలీ బ్రాండ్ల బాగోతం వెలికితీయాలి, కల్తీ సారా మరణాలపై జూడీషియల్ విచారణ వేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మద్యపాన నిషేదం ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిన్న ఇదే అంశంపై ఆందోళన చేసిన నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడుతో సహా అయిదుగురిని సమావేశాల నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

AP Assembly Budget Session tdp protest
AP Assembly Budget Session tdp protest

AP Assembly Budget Session: టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు

టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. టీడీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించుర. రోజు సభ ప్రారంభం కాగానే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రశ్నలకు సమాధానాలు వినే ఓపిక కూడా టీడీపీ సభ్యులకు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షం లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని అన్నారు.  శవరాజకీయాలను టీడీపీ ఇంకెన్ని రోజులు చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు.

 

వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇస్తూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటివద్దే ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఏపిలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేదన్నారు. ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో పేదలకు అండగా ప్రభుత్వం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

 

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju