NewsOrbit
ట్రెండింగ్

Corona Virus: కరోనా ఫోర్త్ వేవ్… దేశాన్ని భయపెడుతున్న ఢిల్లీ..కరోనా లెక్కలు ..!!

Corona Virus: ఈ ఏడాది జనవరి మాసం లో ఒక్కసారిగా ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరగటం తెలిసిందే. దీంతో థర్డ్ వేవ్ వచ్చేసిందని.. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు.. అలర్ట్ కావడం జరిగింది. కేసులు కూడా రోజుకి కొన్ని లక్షణాలు నమోదు కావడం జరిగింది. కానీ సెకండ్ వేవ్ మాదిరిగా… ఓమిక్రన్ వైరస్ అంతగా ప్రభావం చూపించలేదు. పెద్దగా ప్రాణ నష్టం కూడా వాటిల్లలేదు. చాలా మందికి ఈ వైరస్ సోకిన గాని… రెండు మూడు రోజులు మాత్రమే శరీరంలో ప్రభావం చూపింది. మార్చి మొదటి వారంలో చాలావరకు వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అప్పటి నుండి దేశంలో కేసుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో ఇంకా అంతా అయిపోయింది మాస్క్ లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్న సమయంలో .. దేశ రాజధాని ఢిల్లీలో కేసులకు సంబంధించి ఒక్క రోజు వ్యవధిలోనే 60 శాతం పాజిటివిటి పెరగటం.. దేశాన్ని మళ్లీ భయం గుప్పిట్లో కి నేట్టేసినట్లు పరిస్థితి మారింది. పరిస్థితి చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభం అయ్యింది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. Delhi Records 60% Jump In New Covid-19 Cases, Positivity Rate At 5.07% |  Mintఢిల్లీలో ఒక్కసారిగా కేసుల సంఖ్య 60 శాతం పెరగడంతో…జూన్ మాసంలో..కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభంకానున్నాయి అనే అంచనాలు నిజం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది వారాల క్రితం కాన్పూర్ ఐఐటి నిపుణులు కరోనా ఫోర్త్ వేవ్ జూన్ నెలలో ప్రారంభమయ్యే అక్టోబర్ వరకు ఉంటుంది అని హెచ్చరికలు చేశారు. దీంతో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఒకరోజు వ్యవధిలోనే కరోనా పాజిటివ్ కేసులు… 60 శాతం నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఢిల్లీలో 1009 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం తో పోలిస్తే 60 శాతం అత్యధికం. మంగళవారం ఢిల్లీలో కొత్త కరోనా కేసుల సంఖ్య 632. బుధవారానికి ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైన ఈ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేయడం జరిగింది. మాస్కు ధరించకపోతే 500 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు కూడా తెలిపింది. ఫిబ్రవరి పదో తారీకు తర్వాత.. అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Delhi covid news: National capital records 517 fresh Covid cases,  positivity rate 4.21%బెడ్స్… ఇంకా ఆక్సిజన్ సిలిండర్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయనీ పేర్కొంది. ఇక ఇదే సమయంలో ఢిల్లీలో పాఠశాలలు మూసివేయాకుండానే… నిపుణులతో చర్చించి ప్రత్యేకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్.. తీసుకోబోతున్నట్లు డీడీఎంఏ తెలిపింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో ప్రస్తుతం సంక్రమిస్తుంది కరోనా ఎక్స్ఈ వేరియంట్ కాదా అనేది తెలియాల్సి ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఢిల్లీ తోపాటు అత్యధిక భాగం కేసులు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మిజోరాం లో బయట పడటం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో కరోనా లెక్కలు బయటపెట్టింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 13,433 ఉన్నాయని పేర్కొంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,49,114 కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది అని స్పష్టం చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 187.07 కోట్ల వాక్సిన్ డోస్ లు వేయడం జరిగింది అని పేర్కొంది. మొత్తం మీద ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజుల వ్యవధిలోనే 60% పాజిటివ్ కేసులు పెరగటంతో దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో కొన్ని నగరాలలో.. వైరస్ భయంకరంగా వ్యాపించడంతో.. ప్రజలను ఇళ్లకే చైనా ప్రభుత్వం పరిమితం చేసింది. లాక్ డౌన్ కూడా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో అమలు చేయడం జరిగింది. ఇదే పరిస్థితి దేశంలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఫోర్త్ వేవ్ జూన్ లో స్టార్ట్ అవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N