NewsOrbit
రాజ‌కీయాలు

లాలూకు బెయిల్ నిరాకరణ

న్యూఢిల్లీ:  దాణా స్కాం కేసులలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే ఆయన వెంటనే రాజకీయాలు మొదలుపెడతారని సీబీఐ వాదించింది. అయితే, లాలూకు వేసిన శిక్ష 14 ఏళ్లే గానీ 25 ఏళ్లు కాదని, ఆయనేమీ పారిపోవడం లేదని లాలూ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. దానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సమాధానమిచ్చారు. ‘‘అది 25 ఏళ్లా.. 14 ఏళ్లా అనేది హైకోర్టు నిర్ణయిస్తుంది. రాజకీయ నాయకులపై కేసులు త్వరగా తేల్చాలని మేం హైకోర్టుకు చెప్పగలం’’ అన్నారు. పాతికేళ్ల జైలుశిక్షలో లాలూ ఇప్పటికి కేవలం రెండేళ్లే శిక్ష అనుభవించారు.

లాలూను బెయిల్ మీద విడుదల చేస్తే ప్రమాదం ఏముందని సిబల్ వాదించగా, ‘‘ప్రమాదం ఏమీ లేదు, మీరు దోషి అవ్వడం తప్ప. మేం బెయిల్ ఇవ్వగలమని అనుకోవడం లేదు. పిటిషన్ కొట్టేస్తున్నాం’’ అని తేల్చిచెప్పారు. లాలూ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతి ఇవ్వకూడదని సీబీఐ వాదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు దేశం మొత్తాన్ని వణికించాయని, వైద్యపరమైన కారణాలు చూపించి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపింది. ఆసుపత్రి స్పెషల్ వార్డు నుంచి కూడా ఆయన రాజకీయాలు చేస్తున్నారని కోర్టుకు సీబీఐ చెప్పింది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Leave a Comment