NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం ..82వేల మెజార్టీ

Breaking: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ పై విజయం సాధించారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల బరిలో లేకపోవడంతో లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామని వైసీపీ చెబుతూనే వచ్చింది. అయితే పోలింగ్ శాతం తగ్గడంతో 82వేల ఓట్ల ఆధిక్యతతో మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. . ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్ లోనూ వైసీపీ లీడ్ కొనసాగింది.

Breaking Atmakur bypoll ycp candidate mekapati grand victory
Breaking Atmakur bypoll ycp candidate mekapati grand victory

ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్ధికి 1,02240 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్ధికి 19352 మాత్రమే వచ్చాయి. 82888 ఓట్ల అధిక్యతతో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు సురేష్ కుమార్, రిటర్నింగ్ అధికారి హేరేందిర పరిశీలిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మధ్యలోనే బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ కౌంటింగ్ కేంద్రం నుండి నిష్క్రమించారు. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి విజయంతో ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.

Atmakur Bypoll: ఆత్మకూరు అసలు నిజాలు ఇవీ..! వైసీపీ మెజారిటీ పక్కా లెక్క..!!

వైసీపీ లక్ష మెజార్టీ లెక్కలు వేసుకుంటున్నప్పటికీ 75 నుండి 85వేల మధ్య మెజార్టీ వస్తుందని ‘న్యూస్ ఆర్బిట్’ ముందుగానే కథనాన్ని ఇవ్వడం జరిగింది. బీజేపీకి 18 నుండి 22 వేల మధ్య ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా పేర్కొనగా అదే విధంగా 19వేల ఓట్లు వచ్చాయి. ‘న్యూస్ ఆర్బిట్’ అంచనాలకు అనుగుణంగా ఆత్మకూరు బైపోల్ ఫలితం వచ్చింది. ఆత్మకూరులో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల అంచనా అధారంగా ‘న్యూస్ ఆర్బిట్’ .. వైసీపీకి 80వేల మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాల సమయంలోనూ న్యూస్ ఆర్బిట్ అంచనాల లెక్క తప్పలేదు.

 

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju