NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా రోజుల తర్వాత నేడు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) ను కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జరిగిన సమీక్షా సమావేశానికి హజరు కాకపోవడంపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తొంది. రాష్ట్రంలో ఇటీవల హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా ప్రభుత్వం పేరు మార్చింది. అయితే ఈ ప్రతిపాదన సమయంలో సీఎం జగన్ కు వల్లభనేని వంశీ ఈ అంశంపై పునరాలోచన చేయాలంటూ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి.

Vallabhanenni Vamsi

 

ఈ బిల్లులో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలోనూ వల్లభనేని వంశీ పాల్గొనలేదు. అసెంబ్లీ సమావేశాల నుండి వంశీ ఎవరికీ అందుబాటులో లేరు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో సన్నిహితులు సైతం ఎటు వెళ్లారో .. ఎక్కడ ఉన్నారో చెప్పలేకపోయారు. నియోజకవర్గ నేతలకు అందుబాటులో లేరు. దీంతో సోషల్ మీడియాలో పలు రకాలుగా కథనాలు వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబానికి వీరాభిమాని అయిన వంశీ .. హెల్త్ యూనివర్శిటీకీ పేరు మార్పు చేయడంతో అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినబడ్డాయి. అందుకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారనీ, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా నిర్వహించడం లేదని అనుకున్నారు. దాదాపు పదిహేను రోజులకు పైగా వంశీ ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

 

అయితే వంశీ ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో ఆయన అసంతృప్తిని వీడారని వార్తలు వినబడుతున్నాయి. అనారోగ్య కారణంగా కొంత కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందనీ, ఈ నెల 18 నుండి నిరంతరాయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తానని సీఎం జగన్ కు వంశీ చెప్పినట్లు సమాాచారం. ఇదే క్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వంతెనల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనుల గురించి సీఎం జగన్ కు వివరించి నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కోరారని తెలుస్తుంది. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని వంశీ తెలిపారు.

ఎమ్మెల్యే వంశీ ఎక్కడ..? వారం రోజులుగా సైలెంట్.. తీవ్ర అసంతృప్తి..?

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N