NewsOrbit
5th ఎస్టేట్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?  అనేది ఊహించడం కష్టతరంగానే ఉంది. ‘న్యూస్ ఆర్బిట్’ ప్రత్యేక పరిశీలన ద్వారా ఆత్మకూరు ఉప ఎన్నిక, బద్వేల్ ఉప ఎన్నిక, తిరుపతి ఎంపి స్థానానికి ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది..? అనేది ముందుగానే ఇవ్వడం జరిగింది. పోలింగ్ జరిగిన రోజే ఈ పార్టీకి ఇంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది..? ఆయా పార్టీలకు సుమారుగా ఇన్ని ఓట్లు వస్తాయన్న అంచనాతో ‘న్యూస్ ఆర్బిట్’ కథనాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక మాత్రం అంచనాలకు అందడం లేదు. ఎందుకంటే.. ఒక్కో రోజు ఒకొక్క పార్టీ హైలెట్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో లేదు, ఎక్కడో మూడవ స్థానంలో ఉందని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొంది. మహిళా సెంటిమెంట్ ను బాగా రగిలిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాన పార్టీలకు ధీటుగా ఖర్చు పెడుతున్నారు. అంతర్గత వ్యవహారాలు చూస్తున్నారు. అన్ని వనరులను సమకూర్చుకుని సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఐ ప్యాక్ స్ట్రాటజీ కూడా వర్క్ అవుతుండటంతో డిజిటల్ మీడియా పరంగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.

Munugode Bypoll

Munugode Bypoll: టీడీపీ సానుభూతిపరులు ఎటు..?

ప్రజల్లో ప్రచారపరంగా బీజేపీ ముందంజలో ఉంది. పంపిణీల పరంగానూ బీజేపీ ముందు ఉంది. వ్యవస్థలను వాడుకోవడంలో, సెంటిమెంట్ ను రగిలించడంలో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఇలా మూడు పార్టీలు ఎవరి ప్రయత్నాల్లో, ఎవరి అంచనాల్లో వాళ్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది అని అంచనా వేయడం కష్టమే. అయితే.. మనుగోడులో టీడీపీ పరిస్థితి ఏమిటి..? తెలుగు దేశం పార్టీ పోటీ చేయలేదు కదా..! ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఎంత ఉంది..? ఎటు వెళతాయి అనేది పరిశీలన చేస్తే..ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు బ్యాంక్ బాగానే ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్లు ఉండటంతో పాటు గౌడ, యాదవ, ముదిరాజ్ తదితర బీసీ వర్గాలకు చెందిన సుమారు 8 నుండి పది వేల వరకూ టీడీపీ ఓటు బ్యాంక్ ఉంటుంది. వీళ్లలో సుమారు మూడు వేల ఓట్ల వరకూ డబ్బు ప్రభావంతో మారే అవకాశం ఉన్నా మిగిలిన అయిదు వేల ఓట్లు టీడీపీ ఎవరికి చెబితే వాళ్లకు వేస్తారు.

Munugodu By Poll Candidates

 

టీడీపీ తీసుకునే నిర్ణయంతో ఆ అయిదు వేల ఓట్లతో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వెళ్లి పీసీసీ అధ్యక్షుడుగా ఎదిరారన్న భావనతో కాంగ్రెస్ కి ఓట్లు వేయాలని టీడీపీ అనుకుంటుందా..?  లేదు భవిష్యత్తులో టీడీపీ – బీజేపీ పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని టీడీపీ భావిస్తుందా. ? చూడాలి మరి.! బీజేపీ అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తొంది. అంతర్గత సమావేశాల ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని టీడీపీ సానుభూతి పరుల ఓట్లు వేయించుకోవడానికి చర్చలు జరుగుతున్నాయనేది సమాచారం. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి మీద అభిమానం చావదు కాబట్టి కొందరు అటుగానూ ఆలోచించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అభ్యర్ధుల గెలుపు ఓటములో కొంత మేర టీడీపీ ఓటింగ్ ప్రభావం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju