NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: గుజరాత్ ఎన్నికల నగారా మోగింది .. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సీఈసీ

Election Commission

Breaking: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి తో గుజరాత్ అసెంబ్లీ అయిదేళ్ల కాల పరిమితి ముగియనుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన రోజునే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల అవుతుందని ఊహించారు. కానీ గతంలోనూ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలకు కొద్ది రోజుల తేడాతో వేరువేరుగా ఎసీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించింది. అదే మాదిరిగా కొద్ది రోజుల ముందు హమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ విడుదల చేసింది.

 

గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న, రెండో విడత పోలింగ్ డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్నారు.  సెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.  తొలి విడత ఎన్నికలకు నవంబర్ 5వ తేదీ, రెండవ విడత ఎన్నికలకు నవంబర్ 10వ తేదీ నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి విడత ఎన్నికలకు నవంబర్ 5 నుండి 14వ తేదీ వరకూ, రెండవ విడత పోలింగ్ నకు నవంబర్ 10వ తేదీ నుండి 17వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు.   గుజరాత్ గత (2017) ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ జరిగింది. బీజేపీకి 49.1 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 41.4 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం బీజేపీకి 111, కాంగ్రెస్ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ సారి అమ్ ఆద్మీ పార్టీ బలపడటంతో గుజరాత్ లో ఈ సారి త్రిముఖపోరు కనబడుతోంది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 92 స్థానాలు ఏదో ఒక పార్టీ గెలుచుకోవాల్సి ఉంటుంది.

Munugode Bypoll: మునుగోడులో మందకొడిగా సాగుతున్న పోలింగ్ .. అధికారుల తీరుపై పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju