NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబుకి ఢిల్లీ నుండి పిలుపు .. మోడీతో భేటీ: కానీ పొలిటికల్ ట్విస్ట్ ఉంటుందా..!?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది. నేరుగా కేంద్ర మంత్రే స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగే మీటింగ్ కు హజరు కావాలని కోరారు. ఈ అంశాన్ని రాజకీయంగా చూసుకుంటే టీడీపీ అనుకూల మీడియా వారికి అనుకూలంగా కథనాలు ఇస్తాయి. ప్రధాన మంత్రి మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అవుతున్నారంటూ బూస్టింగ్ కథనాన్ని ఇస్తాయి. ఇంతకు ముందు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు రెండు మూడు నిమిషాలు భేటీ అయితేనే నరేంద్ర మోడీ మళ్లీ మీతో మాట్లాడాలని చంద్రబాబుతో అన్నట్లు, దీంతో బీజేపీ, టీడీపీ మధ్య స్నేహభంధం మళ్లీ చిగురిస్తొంది అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి.

 

వాస్తవానికి చంద్రబాబుకు పిలుపు వచ్చింది రాజకీయ పరమైన కారణాలతో కాదు. జీ 20 అంతర్జాతీయ సదస్సు భారత్ లో జరగనున్న నేపథ్యంలో మన దేశంలో అతిథ్యం ఏలా ఉండలి..? ప్రణాళిక ఎలా ఉండాలి..? ఎక్కడెక్కడ నిర్వహించాలి..? ఏయే అంశాలు చర్చించాలి..? దీని వల్ల మన దేశ గౌరవాన్ని ఎలా పెంచుకోవాలి..? మన ప్రతిష్ఠను ఎలా పెంచుకోవాలి..? తదితర అంశాలపై చర్చించేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్5న భేటీ అవుతున్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబుకు పిలుపు వచ్చింది. ఇందులో రాజకీయ ప్రాధాన్యతను వెతకాల్సిన పనే లేదు. కానీ రాజకీయ అంశాన్ని ఎందుకు వెతుకుతారు అంటే..?

Chadrababu

 

ఇటీవల రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు పర్సనల్ గా భేటీ అవుతారని ఆ పార్టీ అనుకూల మీడియా దీన్ని హైలెట్ చేస్తుంది. ఏపిలో తెలుగుదేశం విషయంలో బీజేపీ వైఖరి మారడం. ఇటీవల ప్రధాని మోడీతో విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ఆయనలో మార్పు రావడం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీని మరో సారి దెబ్బతీసి, వైసీపీకే అధికారాన్ని కట్టబెట్టే అలోచనలో బీజేపీ ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు చంద్రబాబు పర్సనల్ గా మోడీతో భేటీ అవుతారని, ఎన్డీఏతో కలవడానికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారంటూ రకరకాల వార్తలు అల్లుతున్నారు. కానీ వాస్తవానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో ఈ మీటింగ్ జరగబోతున్నది. కాకపోతే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ వేత్త హోదాలో చంద్రబాబుకు ప్రత్యేక గౌరవం ఉంటే ఉంటుంది కానీ బీజేపీ – టీడీపీ మధ్య రాజకీయ పరమైన ప్రాధాన్యత ఏమీ ఉండదు అని స్పష్టంగా పేర్కొనవచ్చు.

YSRCP: కొడాలి, అనిల్ యాదవ్ లకు! బాలినేనికి షాక్ ఇచ్చిన జగన్..! 8 మంది మార్పు వెనుక కారణం..!?

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju