NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి విమర్శించిన సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో గత ప్రభుత్వ నిర్వాకాన్ని తెలియజేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత ప్రభుత్వం రైతులకు చేసిన నష్టాన్ని, ప్రభుత్వం అందిస్తున్న కృషిని సీఎం జగన్ వివరించి ఈ వ్యత్యాన్ని రైతులు గమనించాలని కోరారు. సోమవారం నాడు రబీ 2020 – 21, ఖరీఫ్ 2021 సీజన్లకు చెెందిన వైెస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్ – 2022 సీజన్ లో వివిధ రకాల వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ తో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.

AP CM YS Jagan

 

ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ గడచిన మూడేళ్లలో 20.85 లక్షల మంది రైతులకు రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమ చేయగా, తాజాా గా జమ చేసిన మొత్తం 21.31 లక్షల మంది రైతులకు రూ.1,834,79 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ జమ చేసినట్లు అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతులు మద్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా ఫరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి ఉండేదన్నారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరి కొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించే వారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఈ క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగు దారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు.

AP CM YS Jagan

 

అంతే కాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్ ఆడిట్ కింద రైతు భరోసా కేంద్రాల్లో లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు, అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించామని సీఎం జగన్ చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు న్యాయం జరుగుతోందని సీఎం అన్నారు. అప్పటి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ను రైతులు గమనించాలని కోరారు సీఎం జగన్. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని జగన్ పేర్కొన్నారు.

అమరావతి రాజధాని కేసు .. జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట

Related posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?