NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్

ఈ సంవత్సరం వంటలక్క సీరియల్ కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ సెలక్షన్ ఇదే | Best of Telugu Serials in 2022: Karthika Deepam Top 10 Episodes

Best of Karthika Deepam Episodes in 2022

Karthika Deepam Top 10 Episodes 2022: ఈ సంవత్సరం వంటలక్క సీరియల్ కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ సెలక్షన్ ఇదే, స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర బాహుబలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ కు వచ్చినంత టిఆర్పి రేటింగ్ మరే సీరియల్ కు రాదు అనడంలో సందేహంలో లేదు. టిఆర్పి రేటింగ్ లో ఎవర్ గ్రీన్ టాప్ వన్ ప్లేస్ లో గత కొన్నేళ్లుగా కార్తీకదీపం నిలుస్తూ ఉండటం విశేషం.. ఇప్పటివరకు కార్తీక దీపం 1527 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ఇన్ని ఎపిసోడ్స్ అయిన కానీ కార్తీకదీపం టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది అంటే.. ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 1 జనవరి 2022లో ఈ సీరియల్ 1238వ ఎపిసోడ్ తో మొదలై నేటికి 1528 వ ఎపిసోడ్ కి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సంవత్సారం పూర్తి కావస్తోంది.. 2022 లో ఈ సీరియల్ లో గుర్తుండి పోయే టాప్ ఎపిసోడ్స్ ఏంటో చూసేద్దమా..!

బెస్ట్ అఫ్ తెలుగు సీరియల్స్ 2022: కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 10 ఎపిసోడ్ 1275 – మళ్ళీ పెళ్ళి చేసుకున్న కార్తీక్ దీప..!

కార్తీక్ మళ్ళీ పెళ్లి చేసి సౌందర్య తన ముచ్చట తీర్చుకుందామనుకున్న కల నేటితో నేరవేరింది . సౌందర్య
తమ ఇంటిలో ఆహ్లాదకరంగా పెళ్లిని జరిపించేందుకు ఏర్పాట్లు చేసిన సౌందర్య హడావిడిని చూసి డాక్టర్ భారతీ దంపతులు ముచ్చటపడ్డారు. పెళ్లిపీటలపై కార్తీక్, దీప సిగ్గుపడుతూ కనిపించారు. అతిథులు, కార్తీక్, దీప పిల్లలు హిమ, శౌర్య ఆనందంలో మునిగిపోయారు.పెళ్లి జరుగుతుండగా.. దీప కోసం ప్రత్యేకంగా చేయించిన మంగళసూత్రాన్ని పండితుడికి ఇచ్చి.. కార్తీక్‌తో తాళి కట్టించమని చెబుతారు. పండితుడు మంత్రాలు వల్లిస్తుండగా దీప మెడలో కార్తీక్ తాళి కట్టారు. అదే క్షణంలో మోనిత అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్ తాళి కట్టడం పూర్తి కాగానే చప్పట్లు కొడుతూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది.

ఎపిసోడ్ 1275ని ఇక్కడ చూడండి: Disney+ Hotstar Karthika Deepam Top Episodes in 2022

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 9 ఎపిసోడ్ 1295- చనిపోయిన కార్తీక్, దీప..

కార్తీక్ దీప కలిసి సంతోషంగా ఉన్నారు అని అంతా సంతోషిస్తున్న వేళ.. కార్తీక్ తన కుటుంబం తో కలిసి చిక్ మంగుళూరు వెళ్తారు. అక్కడే ఓ లోయ దగ్గర కారు ఆపుతాడు. అప్పుడే హిమ కారు నడుపుతాను అనుకుంటూ అమ్మా ఎక్కి కూర్చో అంటుంది. దీప ఎక్కి కూర్చుంటుంది. దాంతో హిమ కారు స్టార్ట్ చేసేస్తుంది. కార్తీక్ కాస్త దూరంలో ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా.. హిమ కారు ఆపకుండా వాలుగా ఉన్న రోడ్డు మీద వేగంగా వెళ్తుంటే.. దీప భయంతో డాక్టర్ బాబు అని అరుస్తుంది. కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ అది చూసి షాక్ అయిపోతాడు. వెంటనే పరుగున వెళ్లి కారు ఎక్కుతాడు. కానీ అప్పటికే లోయవైపు వెళ్తున్న కారుకి పెద్ద రాయి తగలడంతో ఎగిరి లోయలో పడిపోతుంది. పిల్టీలు కొట్టి కార్ పేలిపోతుంది. సౌర్య వెనుకే పరుగుతీస్తూ వచ్చి ఏడుస్తూ షాక్‌లో ఉండిపోతుంది.

కార్తీక దీపం ఎపిసోడ్ 1295 ఇక్కడ చూడండి: Disney+ Hotstar Karthika Deepam Top 10 Episodes in 2022

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 8 ఎపిసోడ్ 1301: పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు..

హిమ మీద కోపంతో శౌర్య ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. హిమను కూడా సౌందర్య వాళ్ళు అమెరికా తీసుకెళ్లి పోతారు. విభిన్న పరిస్థితుల మధ్య సౌర్య పెరిగి పెద్దదవుతుంది. నానమ్మ తాతయ్యల దగ్గరే హిమ పెరిగి పెద్దదవుతుంది. హిమ డాక్టర్ చదివి మళ్ళి తిరిగి హైదరాబాద్ వస్తుంది. అదే ఊరిలో శౌర్య ఆటో డ్రైవర్ గా ఆటో నడుపుతుంది. హిమ మీద ఉన్న కోపం తగ్గకుడదని తన ఆటోకి తగ్గేదెలే టైటిల్ కూడా పెట్టుకుంది..

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 7 ఎపిసోడ్ 1310 శౌర్య ను గుర్తుపట్టి హిమ..

హిమతో నిరుపమ్ కలిసి మెడికల్ క్యాంపు పెడతాడు . అప్పటికే శౌర్య జ్వాలా హిమ అదే తింగరి కి పరిచయం అవుతుంది. జ్వాల కూడా మెడికల్ క్యాంపు కి వస్తుంది. జ్వాలా ఆ మెడికల్ క్యాంపులో బ్లడ్ ఇవ్వడం చూసి తన చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూసి జ్వాల నే చిన్నప్పటి సౌర్య అని గుర్తుపడుతుంది. చిన్నప్పుడు ఇద్దరు కలిసి వేయించుకున్న పచ్చబొట్టు లో సౌర్య చేతి మీద H అని హిమ చేతి మీద S అని ఉంటాయి. అది చూసి హిమ శౌర్య ను గుర్తు పడుతుంది. హిమ మాత్రమే శౌర్య ను గుర్తు పడుతుంది.

Best of Karthika Deepam Episodes in 2022: ఈ సంవత్సరం వంటలక్క సీరియల్ కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ సెలక్షన్
Best of Karthika Deepam Episodes in 2022: ఈ సంవత్సరం వంటలక్క సీరియల్ కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ సెలక్షన్

బెస్ట్ అఫ్ తెలుగు సీరియల్స్: Karthika Deepam Top Episodes Guide 2022

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 6 ఎపిసోడ్ 1392:

శౌర్య కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న హిమ..హిమ తన అత్త పెద్ద కొడుకు నిరుపమ్ తో సౌందర్య పెళ్లి ఫిక్స్ చేస్తుంది. హిమకు కూడా నిరూపమ్ అంటే చాలా ఇష్టం కావడంతో ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ జ్వాలా నిరూపమ్ ను ఇష్టపడుతుందని ఆఖరి నిమిషంలో హిమ తెలుసుకుంటుంది. దాంతో ఆ ఎంగేజ్మెంట్ ను కావాలని క్యాన్సిల్ చేసుకుంటుంది హిమ. దాంట్లో ఇంట్లో వాళ్ళందరూ హిమని ఇష్టం వచ్చినట్లు తిడతారు. కానీ హిమ మాత్రం చిన్నప్పటినుంచి జ్వాల అన్నింటికీ దూరమైంది. తనకి ఇష్టమైన డాక్టర్ సాబ్ ను తిరిగి ఇస్తే తల చేసిన పాపం తగ్గుతుంది అని హిమ అభిప్రాయపడుతుంది.

కార్తీక దీపం ఎపిసోడ్ 1392 ఇక్కడ చూడండి: Disney+ Hotstar Karthika Deepam Top 10 Episodes in 2022

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 5 ఎపిసోడ్ 1431 దీప రీ ఎంట్రీ..

ఒకవైపు హిమ పెళ్లి రోజు దగ్గరపడుతుండటంతో నిరుపమ్ కంగారుపడతాడు. శౌర్యను పెళ్లి చేసుకోమని హిమ పట్టుపడుతుంది. పెళ్లి పీటల మీద నుంచి మళ్లీ పారిపోతుందా అని నిరుపమ్ మనసులో అనుకొన్నాడు. అయితే ప్రేమ్ అదోలా ఉండటం చూసి… అలా ఉన్నావేంటి అంటే.. మూడ్ బాగాలేదు అని అంటే.. నా పెళ్లి కానివ్వు.. నీ హెల్త్ గురించి ఆలోచిస్తా అంటే.. నీ పెళ్లే నాకు పెద్ద ప్రాబ్లెం అని ప్రేమ్ అన్నాడు. అంతలోనే హిమ నుంచి ఫోన్ రావడంతో నిరుపమ్ షాకింగ్ మూడ్‌లోకి వెళ్లాడు. వంటలక్క రీ ఎంట్రీ.. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్న వంటలక్క అలియాస్ దీప బెడ్ మీద నుంచి లేచినట్టు చూపించారు. బెడ్ పైనుంచి లేచిన దీప.. కార్తీక్ అంటూ అరిచింది. ఈ ట్విస్టుతో కార్తీకదీపం సీరియల్ మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.

కార్తీక దీపం ఎపిసోడ్ 1431 ఇక్కడ చూడండి: Disney+ Hotstar Karthika Deepam Top 10 Episodes in 2022

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 4 ఎపిసోడ్ 1436 కార్తీక్ – డాక్టర్ బాబు హీరోలా రీఎంట్రీ..

దీప డాక్టర్ బాబును వెతుకుతుండగా.. కార్తీక్ హీరోలా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గడ్డంతో గాగుల్స్ పెట్టుకొని కారులో నుంచి దిగాగనే.. డ్రైవర్ వచ్చి.. మీరు జ్యూస్ తాగే సమయం అనగానే.. చూడు సుబ్రమణ్యం అని కార్తీక్ అంటే.. నా పేరు శివ సార్ అంటాడు. సరేలే ఏదో ఒక పేరు. నా ఇష్టం అంటూ కార్తీక్ చెప్పాడు. అయితే లేదు మేడమ్ నీకు సరైన సమయంలో ఫుడ్ పెట్టకపోతే నన్ను రఫ్ ఆడిస్తుంది. మీరు తాగేటప్పుడు తినేటప్పుడు ఫోటో తీసి పంపాలి అని శివ అన్నాడు. శివ, కార్తీక్ రోడ్డుపై వెళ్తుండగా డాక్టర్ బాబును దీప చూసి ఎమోషనల్ అయింది. కార్తీక్ కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి.. డాక్టర్ బాబు అని హత్తుకుంటుంది. ఎవరు డాక్టర్ బాబు.. నేను డాక్టర్ బాబు ఏంటి? అంటూ కార్తీక్ ప్రశ్నార్థకంగా చూశాడు. కార్తీక్ కి గతం గుర్తులేదు అని నిదానంగా తెలుసుకుంటుంది దీప.

కార్తీక దీపం ఎపిసోడ్ 1436 ఇక్కడ చూడండి: Disney+ Hotstar Karthika Deepam Top 10 Episodes in 2022

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 3 ఎపిసోడ్: 1476: మోనిత ను కార్తీక్ ముందే టార్చర్ పెడుతున్న దుర్గ..

దుర్గకి అన్ఎక్స్పెక్టెడ్ గా మోనిత కలుస్తుంది. కానీ దుర్గని చూడగానే మోనిత తప్పించుకుని పారిపోతుంది. ఎలాగైనా మోనిత ను వెతికి పట్టుకోవాలని దుర్గ ఊరంతా తిరుగుతూ ఉండగా దీపను ఇంటి దగ్గర తనని చూసి గుర్తుపడతాడు. ఇంకా ఆ మోనిత నన్ను వేధిస్తుందని కార్తీక్ తన దగ్గరే ఉన్నా కూడా కార్తికి గతం గుర్తు లేకపోవడంతో తన చేతిలో ఆయన పెట్టుకొని ఆటాడిస్తుందని దీప చెప్పి బాధపడుతుంది. నువ్వు బాధపడకు దీపమ్మ ఆ మోనితను టార్చర్ పెట్టి కార్తీక్ సార్ ను నీ దగ్గరికి తీసుకువచ్చి అప్పగించే బాధ్యత నాది దుర్గ మాటిస్తాడు. మోనిత పై కార్తీక్ కి అనుమానం వచ్చేలాగా దుర్గా ప్రవర్తిస్తాడు. తన బాయ్ ఫ్రెండ్ అన్నట్టుగా కార్తీక్ ముందు దుర్గా మోనితను టార్చర్ పెడతాడు.

కార్తీక దీపం ఎపిసోడ్ 1476 ఇక్కడ చూడండి: Disney+ Hotstar Karthika Deepam Top 10 Episodes in 2022

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 2 ఎపిసోడ్ 1508 కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చింది..

సంగారెడ్డి వెళ్ళినా కార్తీక్ మోనిత దీప అక్కడ సంబరాల్లో పాల్గొంటారు. మోనిత మీద కోపంతో శౌర్య తన మీదికి పక్కనే ఉన్న రాయి తీసి విసిరి కొడుతుంది అని తెలుసుకున్న మోనిత పక్కకు జరుగుతుంది. ఆ రాయి వెళ్లి కార్తీక్ తలకి గట్టిగా తగులుతుంది. దాంతో కార్తీక్ గతం గుర్తుకొస్తుంది. అప్పుడే మోనిత దీపను చంపాలని ప్రయత్నిస్తుంది. మోనిత ఇంకా మారలేదని తనకోసం ఏమైనా చేస్తుంది. మరోవైపు వారణాసిని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. నాకు గతం గుర్తుకు వచ్చినా కానీ దీపకి ఇప్పుడప్పుడే నిజం చెప్పకూడదని డిసైడ్ అవుతాడు. శౌర్య ను వెతకాలని.. సౌర్యను వెతికిన తరువాత తనను తీసుకువచ్చి దీపకు నిజం చెప్పాలని అనుకుంటాడు.

కార్తీక దీపం ఎపిసోడ్ 1508 ఇక్కడ చూడండి: Disney+ Hotstar Karthika Deepam Top 10 Episodes in 2022

కార్తీక దీపం టాప్ 10 ఎపిసోడ్స్ ర్యాంక్ 1 ఎపిసోడ్ ఎపిసోడ్ 1526: దీప కి నిజం చెప్పిన కార్తీక్..

సౌర్య ను ఎలాగైనా వెతికి పట్టుకోవాలని దీప సంగారెడ్డి మొత్తం జల్లెడ వేసి అడుగుతుంది. ఇంద్రుడు దగ్గర సౌర్య ఉందని తెలుసుకున్న దీప ఎలాగైనా సరే తన దగ్గరకు తెచ్చుకోవాలని అనుకుంటుంది. శౌర్య ని చూపించి కార్తీక్ కి నిజం వచ్చేలాగా చేయాలని అనుకుంటుంది. అంతలో దీప కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్లిన కార్తీక్ పరీక్షలు చేయించిన తర్వాత దీపకు గుండె ఆపరేషన్ చేయాలని చెబుతార ఇక కార్తికే దీపకు దగ్గరుండి హార్ట్ సర్జరీ చేస్తాడు. తను ఆ సమయంలో కూడా హాస్పటల్ బెడ్ మీద నుంచి లేచి వెళ్లిపోవాలని శౌర్య ను వెతకాలని అనుకుంటుంది. అప్పుడే డాక్టర్ కార్తీక్ మీకు హార్ట్ సర్జరీ చేశారని డాక్టర్ చెబుతుంది. అవును నేనే చేశాను దీప అని కార్తీక్ నాకు గతం గుర్తుకు వచ్చిందని చెబుతాడు.

కార్తీక దీపం ఎపిసోడ్ 1508 ఇక్కడ చూడండి: Disney+ Hotstar Karthika Deepam Top 10 Episodes in 2022

న్యూస్ ఆర్బిట్ నుండి కార్తీక దీపం సంబంధిత లింకులు: Karthika Deepam

Avunu Valliddaru Ishta Paddaru Serial: “స్టార్ మా” లో కొత్త సీరియల్ “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” పూర్తి వివరాలు- ప్రోమో చూడండి

Related posts

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri