NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ ఆమోదం .. ఈ సారి రూ.3లక్షల కోట్లతో బడ్జెట్..?

ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ 2023 – 24 కు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. మూడు లక్షల కోట్లతో రూపొందించిన తెలంగాణ పద్దుపై గవర్నర్ తమిళిసై సంతకం చేసి ఆమోదించారు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ ఇప్పుడు ప్రవేశపెడుతున్నది చివరి బడ్జెట్. అందుకే భారీ అంచనాలు ఉన్న బడ్జెట్ పై కేసిఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తొంది.

kcr tamilisai

 

నిన్నటి వరకూ గవర్నర్, సర్కార్ ఎవరికి వారే పట్టుదలతో ఉండటంతో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. చివరకు ఈ అంశంపై ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే వరకూ వెళ్లింది. అయితే హైకోర్టులోని అడ్వొకేట్ జనరల్ ఛాంబర్ లో ప్రభుత్వ తరపు న్యాయవాది, గవర్నర్ తరపు న్యాయవాది జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. ప్రభుత్వం ఒక మెట్టు దిగి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలియజేయడంతో పాటు లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో బడ్జెట్ ఆమోదానికి గవర్నర్ అంగీకరించారు. అయితే ముందుగా ప్రకటించినట్లుగా మూడో తేదీన ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ను ఆరవ తేదీకి మార్చారు.

పుదుచ్చేరి పర్యటన ముగించుకుని నిన్న సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చిన గవర్నర్ తమిళిసై తో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరపున గవర్నర్ ను కోరడంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిన ఆహ్వానించారు. ఉభయ సభల ప్రొరోగ్, తిరిగి సమావేశం అయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు తదితర అంశాలపై గవర్నర్ తో చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రసంగ పాఠాన్ని గవర్నర్ కు అందించారు. ఇదే క్రమంలో పెండింగ్ బిల్లులపై చర్చకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తొంది.

గతంలో రెండు సార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసీందే. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినా చివరి నిమిషంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది.  గవర్నర్ ఆమోదం నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఆ రోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం .. తొమ్మిది మంది మృతి

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju